Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Whatsapp Ellipse : వాట్సాప్‌కు గ్రహణం పట్టింది.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..!

Whatsapp Ellipse : ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సర్వీసులు (Whatsapp Services Down) నిలిచిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి వాట్సాప్ సర్వీసులు పనిచేయకపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ మెసేజ్ పంపినా వెళ్లడం లేదు. వాట్సాప్ చాట్ నుంచి మెసేజ్ లేదా ఫొటోలు, వీడియోలు ఏది పంపినా వెయిటింగ్ సింబల్ మాత్రమే కనిపిస్తుంది. అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడనుంది.

Whatsapp Ellipse _ Whatsapp Users Funny Comments Over Whatsapp Outage on Oct 25

ఈ నేపథ్యంలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోవడంతో యూజర్లు అందరూ వాట్సాప్ కు గ్రహణం పట్టిందంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. వాట్సాప్ గ్రహణం వీడాలంటే.. సూర్యగ్రహణం వీడేంతవరకూ వాట్సాప్ సర్వీసులు పనిచేయవని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. వాట్సాప్ కు గ్రహణం వీడిన తర్వాత అంతా వాట్సాప్ డివైజ్ లను క్లీన్ చేసుకోవాలంటూ మరికొందరూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Whatsapp Ellipse : వాట్సాప్ బంద్.. ఆ డివైజ్‌ల్లో పనిచేయదు..   

ఏదిఏమైనా వాట్సాప్ సర్వీసులు నిలిచిపోవడంతో యూజర్లలో ఆందోళన నెలకొంది. వాట్సాప్ యూజర్ల నుంచి ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మెటా వాట్సాప్ స్పందించింది. త్వరలోనే వాట్సాప్ సర్వీసులు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. వాస్తవానికి అక్టోబర్ 25 నుంచి వాట్సాప్ సర్వీసులు చాలా ఆండ్రాయిడ్, ఐఫోన్లలో నిలిచిపోనున్నాయి. అందులో భాగంగానే వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వాట్సాప్ సర్వీసులు ఓఎస్ అప్ డేట్స్ అందుకోలేని డివైజ్ ల్లో వాట్సాప్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నట్టు ఒక ప్రకటనలో వాట్సాప్ వెల్లడించింది.

Advertisement
Whatsapp Ellipse _ Whatsapp Users Funny Comments Over Whatsapp Outage on Oct 25

iOS 10, iOS 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఐఫోన్లలో ఇప్పటినుంచి వాట్సాప్ పనిచేయదు. ఇప్పటినుంచి iPhone 4, iPhone 4S, iPhone 5, iPhone 5C ఫోన్లలో ఈ వాట్సాప్ సర్వీసులు పనిచేయవు. ఆపిల్ నిబంధనలు ప్రకారం.. iPhone 4, iPhone 4S డివైజ్ ల్లో ఇకపై OS అప్ డేట్ కాదని కంపెనీ తెలిపింది. iPhone 5, iphone 5C మోడళ్లలో మాత్రమే OS అప్ డేట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది.

అందుకే ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లలో iOS 12 వెంటనే అప్ డేట్ చేసుకోవాలని వాట్సాప్ సూచిస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లు కూడా 4.04 వెర్షన్ OSతో రన్ అవుతున్న ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వాట్సాప్ వెర్షన్‌కు తమ డివైజ్ లను అప్ డేట్ చేసుకోవాల్సిందిగా వాట్సాప్ సూచించింది.

Whatsapp Down : యూజర్లకు షాకింగ్ న్యూస్.. నిలిచిపోయిన వాట్సాప్ సర్వీసులు.. మీ డివైజ్ చెక్ చేసుకున్నారా?

Advertisement
Exit mobile version