Best Offer : సూపర్ ఆఫర్, రూ.500 ఈఎంఐతో స్మార్ట్ ఫోన్..

Best Offer : ఇది స్మార్ట్ ఫోన్ యుగం. ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే అన్నట్లుగా ఉంది. ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ వీడియో కాల్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అవసరం అవుతున్నాయి. కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారు తక్కువ ధరలో ఫోన్ కావాలనుకుంటారు. అలాంటి వారి కోసం మోటోరోలా మరో కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. పది వేల లోపు స్మార్ట్ ఫోన్ కోసం చూసే వారికి ఇది చక్కని, సూపర్ ఆఫర్ అవుతుంది.

Smart phone best deals, get phone with 500 and emi
Smart phone best deals, get phone with 500 and emi

మోటోరోలా ఈ22ఎస్ పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 10 వేల లోపు సెగ్మెంట్ లో తీసుకువచ్చింది మోటోరోలా. ఈ మోడల్ తక్కువ ధరలో మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తోంది. ఇందులో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. 90 హెడ్జ్ డిస్ ప్లే, 5000mAh బ్యాటరీతో వస్తోంది. ఇటీవల రూ. 10 వేల బడ్జెట్ లో మోటో ఈ32, మోటో ఈ32ఎస్ మోడల్స్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకా కాస్త తక్కువ ధరకు మోటోరోలా ఈ22ఎస్ తీసుకువచ్చింది.

ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.8,999. ఫ్లిప్ కార్ట్ తో పాటు రీటైల్ స్టోర్లలో కొనవచ్చు. ఫ్లిప్ కార్ట్ లో బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.1500 నుండి ప్రారంభం అవుతుంది. రూ.500 లోపే ఈఎంఐ ఆప్షన్స్ తో ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Read Also : Whatsapp Ellipse : వాట్సాప్‌కు గ్రహణం పట్టింది.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel