Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Golden Tortoise : దగదగ మెరిసే బంగారు తాబేలును చూశారా.. ఎక్కడో తెలుసా?

Golden Tortoise : బంగారు తాబేలును ఎప్పుడైనా చూశారా? బంగారు వర్ణంతో దగదగ మెరిసే తాబేళ్లను చూసేందుకు జనమంతా క్యూ కడుతున్నారు. ఈ అరుదైన తాబేలు ఒడిశాలో కనిపించింది. బంగారు వర్ణంలో దగదగా మెరిసిపోతోంది. రాష్ట్రంలోని భద్రక్‌ జిల్లా బెంటాల్పూర్‌ గ్రామంలో రైతుకు ఈ బంగారు తాబేళ్లు కనిపించాయి. ఈ తాబేలు బరువు రెండున్నర కిలోలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. తేటగా ఉండే నీళ్లల్లో మాత్రమే ఈ తాబేలు జీవిస్తాయని అంటున్నారు. ఈ తాబేలును ... Read more

By Vinod Kumar

Published on: July 6, 2022 11:51 AM

Updated on: July 6, 2022 11:51 AM

Rare Golden Tortoise found in Odisha, Photos Viral

---Advertisement---

Golden Tortoise : బంగారు తాబేలును ఎప్పుడైనా చూశారా? బంగారు వర్ణంతో దగదగ మెరిసే తాబేళ్లను చూసేందుకు జనమంతా క్యూ కడుతున్నారు. ఈ అరుదైన తాబేలు ఒడిశాలో కనిపించింది. బంగారు వర్ణంలో దగదగా మెరిసిపోతోంది. రాష్ట్రంలోని భద్రక్‌ జిల్లా బెంటాల్పూర్‌ గ్రామంలో రైతుకు ఈ బంగారు తాబేళ్లు కనిపించాయి. ఈ తాబేలు బరువు రెండున్నర కిలోలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

Rare Golden Tortoise found in Odisha, Photos Viral
Rare Golden Tortoise found in Odisha, Photos Viral

తేటగా ఉండే నీళ్లల్లో మాత్రమే ఈ తాబేలు జీవిస్తాయని అంటున్నారు. ఈ తాబేలును మంచినీటిలోకి తరలించినట్టు చెప్పారు. ఈ తాబేలును చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. దూరం నుంచి చూస్తే.. అసలైన బంగారమనుకోవచ్చునని తెలిపారు. ఈ తాబేలును అటవీ అధికారులకు అప్పగించారు. గత జూన్‌లో బైతరణి నది ఒడ్డున అరుదైన బంగారం తాబేలు కనిపించింది. బరువు దాదాపు 2 కిలోలు ఉంటుందని తెలిపింది.

Advertisement

Read Also : Golden Tortoise: ఆశ్చర్యపరుస్తున్న బంగారు తాబేళ్లు

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.