Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Petrol Prices Today : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 16 రోజుల్లో 14 సార్లు పెంపు.. ఎక్కడెంతో తెలుసా?

Petrol Prices Today : పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 16 రోజుల వ్యవధిలోనే మొత్తం 14 సార్లు పెట్రో, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి చమురు స

By Vinod Kumar

Published on: April 6, 2022 10:37 AM

Updated on: April 6, 2022 6:57 PM

petrol-and-diesel-price-today-3

---Advertisement---

Petrol Prices Today : పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 16 రోజుల వ్యవధిలోనే మొత్తం 14 సార్లు పెట్రో, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి చమురు సంస్థలు. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు మరో 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41కు చేరగా.. డీజిల్ ధర రూ.96.67కు పెరిగింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.120.51కు చేరింది. డీజిల్ ధర 85 పైసలు అధికమై.. రూ.104.77కు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 90 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. డీజిల్ ధరపై 87 పైసలు వడ్డించాయి. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.119.49కు చేరింది. డీజిల్ ధర రూ.105.49కు ఎగబాకింది.

Advertisement

గుంటూరులో పెట్రోల్ ధర రూ.120 దాటింది. తాజాగా పెంచిన 87 పైసలతో.. పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.87 పైసలు పెరిగి.. రూ.106.91కు చేరుకుంది. వైజాగ్​లో 87 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.119.88కు చేరుకుంది. డీజిల్ ధర 87 పైసలు అధికమై.. రూ.105.66కు ఎగబాకింది.

Read Also : 

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.