Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral news: టీచర్ కు ముద్దు పెట్టాడు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Viral news: చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది. చూసేందుకు లడ్డుగా.. బుజ్జి బుజ్జి మాటలతో తెగ అల్లరి చేసేస్తుంటారు. అంతేనా బుడి బుడి అడుగులు వేస్తూ భలే మైమరిపిస్తుంటారు. వారి చేష్టలు చూస్తే ఎంత కోపంలో ఉన్న వాళ్లయినా ఇట్టే కరిగిపోవాల్సిందే. అయితే అలాంటి ఓ ఘటనే తాజాగా జరిగింది. తరగతిలోని పిల్లలంతా అల్లరి చేస్తుండటంతో ఓ బాలుడితో నువ్వు నాతో మాట్లాడొద్దు ఇక నుంచి అని ఓ టీచర్ చెప్పింది. దానికి భయపడిపోయిన ... Read more

By Vinod Kumar

Published on: September 16, 2022 1:15 PM

Updated on: September 16, 2022 1:12 PM

---Advertisement---

Viral news: చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది. చూసేందుకు లడ్డుగా.. బుజ్జి బుజ్జి మాటలతో తెగ అల్లరి చేసేస్తుంటారు. అంతేనా బుడి బుడి అడుగులు వేస్తూ భలే మైమరిపిస్తుంటారు. వారి చేష్టలు చూస్తే ఎంత కోపంలో ఉన్న వాళ్లయినా ఇట్టే కరిగిపోవాల్సిందే. అయితే అలాంటి ఓ ఘటనే తాజాగా జరిగింది. తరగతిలోని పిల్లలంతా అల్లరి చేస్తుండటంతో ఓ బాలుడితో నువ్వు నాతో మాట్లాడొద్దు ఇక నుంచి అని ఓ టీచర్ చెప్పింది. దానికి భయపడిపోయిన ఆ బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి టీచర్ మీదకు ఎక్కి కూర్చున్నాడు. అయితే బాలుడు అంత ప్రేమగా సారీ చెప్పినా ఆ టీచర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

Advertisement

నీవెప్పుడూ ఇలాగే చేస్తావంటూ అంది. నీతో ఇక మాట్లాడనంటూ అలక నటించింది. అందుకు బుడ్డోడు బదులిస్తూ…. మళ్లీ క్లాస్ లో అల్లరి చేయనని చెప్పాడు. ఇది చివరిసారి అనడంతో.. రెండు ముద్దులు పెట్టాడు. దీంతో టీచరమ్మ అలకను వీడింది. బుడ్డోడికి రిటర్న్ కిస్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ టీచరమ్మను భలే ఐస్ చేశావ్ రా బుడ్డోడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.