Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Janaki kalaganaledu : అడ్డంగా దొరికిపోయిన జానకి.. బాంబు పేల్చడానికి సిద్ధమైన మల్లిక..?

Janaki kalaganaledu Mar 2 Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏమేం హైలెట్ జరిగాయో తెలుసుకుందాం.. ఇక జానకి రాత్రి అంతా నిద్ర లేకుండా కేకులు తయారు చేసి అలసిపోయి ఒక పక్కన నిద్ర పోతూ ఉంటుంది.

janaki-booked-mallika-is-ready-to-insult-her

జానకి మీద సూర్యుడు ఎండ పడుతుందని రామచంద్ర తన కండువా అడ్డుపెట్టి నీడలా ఉంటాడు. అలాగే నిద్రపోతున్న జానకిని రామచంద్ర ఎత్తుకుని మంచం దగ్గరికి తీసుకెళ్ళి పడుకో పెడతాడు. అప్పుడు జానకి మెలకువగానే ఉన్నప్పటికీ తాను నిద్ర పోతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది.

మరొకవైపు మల్లిక వంట చేస్తుండగా చేయి కాలి గట్టి గట్టిగా గోల చేస్తూ కామెడీ గా అరుస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన జానకి వంట నేను చేస్తాను లే నువ్వు వెళ్లి ముందు రాసుకో అని చెబుతుంది. అనంతరం సుబ్బయ్య కూతురు పెళ్ళికి తాంబూలం నేను రామచంద్ర గారు వెళ్లి ఇస్తాము అని చెప్పి జానకి, జ్ఞానంబ దగ్గరనుంచి తాంబూలం తీసుకుంటుంది.

Advertisement

Janaki kalaganaledu Mar 2 Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్..

మల్లిక సుబ్బయ్య కూతురు పెళ్ళికి బావగారు ఒక్కరే వెళ్లారు జానకి వెళ్ళలేదు అని జ్ఞానాంబ కు చెప్పినప్పటికీ జ్ఞానాంబ నమ్మకపోవడంతో అప్పుడు మల్లిక పక్కింటి లీలావతి ని పిలిచి ఆమెతోనే చెప్పిస్తుంది. ఇక అక్కడికి వచ్చిన లీలావతి తాంబూలం రామచంద్ర ఒక్కడే పెట్టాడు అని చెబుతుంది. ఆ విషయం తెలిసిన జ్ఞానాంబ జానకి పై తీవ్ర కోపం వ్యక్తం చేస్తుంది.

ఈలోపు జానకి, రామచంద్ర లు అక్కడికి రాగా,పెళ్లికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్లావు అని జానకి నిలదీస్తుంది. అప్పుడు రామచంద్ర మేనమామకు బదులుగా మెట్టెలు తీసుకుని రావడానికి వెళ్ళింది అని కవర్ చేస్తాడు. ఆ తరువాత జానకి ని క్లాస్ కి తీసుకెళ్లడానికి రామచంద్ర చాటుగా గోడదూకిస్తాడు.

జానకి, రామచంద్ర దొంగచాటుగా గోడ దూకుతూ ఉండగా అది మల్లిక చూస్తుంది. ఇక వెంటనే ఆ విషయం జ్ఞానాంబ చెప్పడానికి ఇంట్లోకి పరుగులు తీస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Janaki kalaganaledu: అడ్డంగా దొరికిపోయిన జానకి.. బాంబు పేల్చడానికి సిద్ధమైన మల్లిక..?

Exit mobile version