Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Father Son Agreement : కన్నతండ్రితో ఆరేళ్ల బుడతడి అగ్రిమెంట్.. రూ.100 కోసం వారం రోజులు ఏం చేశాడంటే?

Father Son Agreement : ఆరేళ్ల బుడతడు.. కానీ, తెలివిలో అతడికి అతడే సాటి.. తన నచ్చిన పనులను చేసేందుకు అనుమతి కోసం ఏకంగా కన్నతండ్రితోనే అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. రూ.100 అడిగితే తాను చెప్పినట్టు చేస్తేనే ఇస్తానని తండ్రి చెప్పడంతో ఆ పనులు చేసేందుకు ఆరేళ్ల బాలుడు అంగీకరించాడు. సరిగా వారం రోజుల పాటు బుద్ధిగా చేస్తే తాను అడిగిన రూ.100 కోసం పనులు చక్కగా పూర్తి చేశాడు. అగ్రిమెంట్ లో భాగంగా 7 రోజులపాటు తండ్రి ... Read more

By Vinod Kumar

Published on: February 4, 2022 1:53 PM

Updated on: February 4, 2022 1:53 PM

Father Son Agreement : Father signs ‘agreement’ with 6-yr-old for his daily routine, Agreement Photo Viral on Social Media

---Advertisement---

Father Son Agreement : ఆరేళ్ల బుడతడు.. కానీ, తెలివిలో అతడికి అతడే సాటి.. తన నచ్చిన పనులను చేసేందుకు అనుమతి కోసం ఏకంగా కన్నతండ్రితోనే అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. రూ.100 అడిగితే తాను చెప్పినట్టు చేస్తేనే ఇస్తానని తండ్రి చెప్పడంతో ఆ పనులు చేసేందుకు ఆరేళ్ల బాలుడు అంగీకరించాడు. సరిగా వారం రోజుల పాటు బుద్ధిగా చేస్తే తాను అడిగిన రూ.100 కోసం పనులు చక్కగా పూర్తి చేశాడు.

అగ్రిమెంట్ లో భాగంగా 7 రోజులపాటు తండ్రి చెప్పినట్టే నడుచుకున్నాడు. ఇప్పుడా తండ్రీకొడుకల అగ్రిమెంట్ పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ అగ్రిమెంట్ చూసిన నెటిజన్లు సరదగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఆరేళ్ల కొడుకును కంట్రోల్ చేసేందుకు తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి కొడుకుతో డీల్ కుదర్చుకున్నాడు. ఇలాగైనా దారిలోకి వస్తాడని ఓ ప్రయత్నంగా చేశాడు. ఫలించింది. కుమారుడు దిగొచ్చాడు. ఇంతకీ ఆ తండ్రి ఇచ్చిన అగ్రిమెంట్ లో ఏముందంటే.. ఒక టైం టేబుల్ తయారుచేశాడు తండ్రి..

అందులో ప్రతిరోజు ఉదయం ఏ టైంకు నిద్రలేవాలి.. ఆ రోజంతా ఏం చేయాలి.. రాత్రి ఎపుడు పడుకోవాలి అనే వివరాలు మొత్తం ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేశాడు. ప్రతిదానికి ఏడ్వకూడదు.. అలర్లి చేయకూడదు.. గొడవ చేయొద్దు.. రోజూ ఇదే టైం టేబుల్ పాటించాల్సి ఉంటుంది. అలా చేస్తే రోజుకు రూ.10 ఇస్తానని స్పష్టం చేశాడు.

వారం రోజులపాటు చేస్తే బోనస్‌గా రూ.100 ఇస్తానని అగ్రిమెంట్ చేశాడు. ఇందుకు నీకు ఇష్టమైతే సంతకం చేయాలని బాలుడికి సూచించాడు. రూ. 100 కోసం ఆ బుడ్డోడు.. అగ్రిమెంట్‌పై సంతకం పెట్టేశాడు కూడా. అప్పుడా తండ్రి ఆనందానికి అవధుల్లేవు. ఆ అగ్రిమెంట్ పేపర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

Read Also : Astrology News : మీ జాతకం ప్రకారం.. ఏ రాశుల వారు ఏ రంగు వాహనాలను వాడితే మంచిదో తెలుసా…

Advertisement

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.