Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

TS Police recruitment : పోలీసు ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు..!

TS Police recruitment : పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులు బాటు కల్పించింది. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువును పొడిగిస్తునట్లు స్పష్టం చేసింది. ఈనెల 26 వరకు గడువు పొడిగిస్తు పోలీస్ నియామక సంస్థ ప్రకటన వెలువరించింది. నిజానికి పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ రాత్రి 10 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. అయితే ఇవాళ యూనిఫామ్ సర్వీసు ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి మరో రెండేళ్లు పొడిగిస్తూ సర్కారు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే మూడేళ్లు పొడగించిన ప్రభుత్వం… తాజాగా మరో రెండేళ్లు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు వయో పరిమితి ఐదేళ్లు సడలింపు ఇచ్చినట్లు అయింది.

TS Police recruitment

అయితే వయో పరిమితి పెంచినా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవాళ రాత్రి వరకు ఉండటం వల్ల అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో ఈనెల 26 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తు పోలీసు నియామక మండలి నిర్ణయం తీసుకుంది. ఈనెల 2వ తేదీన ప్రారంభమమైన దరఖాస్తుల ప్రక్రియ 26న ముగియనుంది. సర్వర్లలో సాంకేతిక సమస్య తలెత్తకుండా అధికారులు సామర్థ్యాన్ని పెంచారు. నిన్న ఒక్క రోజే లక్ష దరఖాస్తులు వచ్చాయి. ఒకేసారి నగదు చెల్లింపులు జరుపుతుండటంతో, సాంకేతికత సమస్యలు తలెత్తుతున్నాయి.

నగదు చెల్లింపుజరిగితేనే దరఖాస్తు ప్రక్రియ పూర్తవతుందని పోలీసు నియామక మండలి అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఖాతాలో నగదు డెబిట్ అయినా… వారం వ్యవధిలో తిరిగి ఖాతాలో జమ అవుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 10లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావు తెలిపారు. వచ్చే మార్చి కల్లా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Read Also : CM kcr: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. ఏంటో మీరే చూడండి!

Exit mobile version