వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral Video: అమ్మాయిలే కాదండోయ్.. ఈ ఏనుగు కూడా ఎంచక్కా పానీ పూరీ లాగించేస్తోంది!

Viral Video: పానీపూరీల గురించి వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ లాగించే అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్ లలో అమ్మాయిలు పానీపూరి లాగించే వీడియోలు, మీమ్స్ విపరీతంగా కనిపిస్తాయి. అయితే అమ్మాయిలే కాదండోయ్ ఓ ఏనుగు కూడా పానీపూరిని లేగించేసింది. అలా ఇలా కాదండ్.. చక్కగా చాలా ఇష్టంగా తినేసింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ స్టాల్ వద్ద నిలబడీ మరీ పానీపూరి కుమ్మేసింది. అయితే ఏనుగుకు సదరు ... Read more

By Vinod Kumar

Published on: October 12, 2022 2:00 PM

Updated on: October 12, 2022 1:57 PM

Elephant eats pani puri at roadside stall video goes viral

---Advertisement---

Viral Video: పానీపూరీల గురించి వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ లాగించే అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్ లలో అమ్మాయిలు పానీపూరి లాగించే వీడియోలు, మీమ్స్ విపరీతంగా కనిపిస్తాయి. అయితే అమ్మాయిలే కాదండోయ్ ఓ ఏనుగు కూడా పానీపూరిని లేగించేసింది. అలా ఇలా కాదండ్.. చక్కగా చాలా ఇష్టంగా తినేసింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ స్టాల్ వద్ద నిలబడీ మరీ పానీపూరి కుమ్మేసింది. అయితే ఏనుగుకు సదరు బండి అతనే సర్వ్ చేయడం గమనార్హం.

ఎనుగు కూడా దొరికాయి కదా అని.. అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన అస్సాంలోని తేజ్ పూర్ లో చోటు చేసుకుంది.

అయితే దీన్ని చూసిన ప్రతీ ఒక్కరూ వీడియోను షేర్ చేస్తుండటంతో… నెట్టిళ్లు మొత్తం షేక్ అవుతోంది. చిన్న పిల్లలు తింటుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఈ ఏనుగు పానీపూరి తింటుంటే కూడా అంతే ముద్దుగా అనిపిస్తోంది.  మీరూ ఓ సారి ఈ వీడియోపై లుక్కేయండి.

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel