Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

CPI Narayana: ఒకరు ఊసరవెల్లి, ఒకరు ల్యాండ్ మైన్ అంట.. సీపీఐ నారాయణ కామెంట్లు!

CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తరచూ సంచలన కామెంట్లు చేస్తుంటారు. రాజకీయ అంశాలపై స్పందిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతుంటారు. ఒక్కోసారి

By Vinod Kumar

Published on: July 18, 2022 6:00 PM

Updated on: July 18, 2022 5:41 PM

---Advertisement---

CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తరచూ సంచలన కామెంట్లు చేస్తుంటారు. రాజకీయ అంశాలపై స్పందిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతుంటారు. ఒక్కోసారి ఆయన చేసే కామెంట్లు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఏపీలోని ప్రధాన పార్టీలు అయిన తెదేపా, వైసీపీ పార్టీలపై స్పందించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవష్కరణకు చిరంజీవి హాజరవడాన్ని తప్పు పట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటి వాడంటూ హాట్ కామెంట్లు చేశారు.

CPI Narayana shocking comments on chrianjeevi and pawan kalyan

Advertisement

అల్లూరి విగ్రహ ఆవిష్కరణకు సూపర్ స్టార్ కృష్ణను వేదిక మీదకు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని.. ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా విమర్సించారు. పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ లాంటి వాడని.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదంటూ సెటైర్లు వేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిందేమీ లేదని… రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి అన్ని పార్టీలు ఎం దుకు మద్దతు ఇస్తున్నాయంటూ ప్రశ్నించారు. దిల్లీలోని బీజేపీ నేతలు బ్లాక్ మెయిలింగ్ కు ఏపీ నేతలు భయపడి ఇలా చేస్తున్నారన్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.