CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జార్ఖండ్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే కెసిఆర్ తోపాటు కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లు ఉన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, శిబు సోరెన్‌లతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోని కేసీఆర్ ఉన్న ఫలంగా జార్ఖండ్ వెళ్లడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తన పార్టీని జాతీయ స్థాయిలో స్థాయిలోకి తీసుకువెళ్లాలని సన్నాహాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తానని గతంలో కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇచ్చిన మాట ప్రకారం కెసిఆర్ జార్ఖండ్ లో మరణించిన ఇద్దరు సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఝార్ఖండ్ వెళ్ళినట్లు తెలుస్తుంది..10 లక్షల చెక్కులను జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు అందజేశారు అదే విధంగా వ్యవసాయ చట్టాలలో భాగంగా రైతులకు ఉద్యమంలో పోరాడి మరణించిన వారి కుటుంబాలకు కూడా ఈయన ఆర్థిక సహాయం ప్రకటించారు.
