Alberto nonino: పాపం, పగోడికి కూడా ఈఅథ్లెట్ కి వచ్చిన కష్టాలు రాకూడదు.. ఏమైందంటే!

Alberto nonino: ప్రపంచ స్థాయి వేదికలపై క్రీడాకారులకు అప్పుడప్పుడూ అనుకోని విధమైన పరిస్థితులు ఎదురవుతాయి ఇదీ అలాంటిదే. కొలంబియాలో జరుగుతున్న వరల్డ్ అధ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్ షిప్స్ లో ఇటలీ అథ్లెట్ ఆల్బెర్టో నోనినో ను దురదృష్టం వెంటాడింది. శుక్రవారం కాలీలో జరిగిన 400 మీటర్ల డెకాథ్లన్ ఈవెంట్ మధ్యలో ఆల్బెర్టో నోనిననో దుస్తుల్లో సమస్య తలెత్తింది. జననాంగ షార్ట్ నుంచి బయటకు రావడంతో అతని పరుగులో వేగం తగ్గింది. ఈ సమస్యను చక్కదిద్దుకునేందుకు ఆయన రెండు మూడు సార్లు ప్రయత్నించినా పలితం లేకపోయింది. ప్రత్యర్థులు నోనినోను అధిగమించి ముందుకు వెళ్లిపోయారు. దీంతో మొత్తం మీద 51.57 సెకన్లలో రేస్ ను పూర్తి చేసి నోనినో ఈవెంట్ లో అందరి కంటే చిట్ట చివరన నిలిచారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చూసిన వారంతా అయ్యో పాపం అంటూ కామెంట్లు చేస్తున్నారు. పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని మరికొందరు, ఏంటి బయ్యా ఇది ముందే చూస్కోవాలి కదా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel