Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

APSRTC Charges hike : ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. ఎంతో తెలుసా?

APSRTC Charges Hike : డీజిల్ సెస్‌ పేరుతో ఏపీఎస్ ​ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లె వెలుగు బస్సుల్లో టికెట్‌పై రూ.2, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.5, దూర

By Vinod Kumar

Published on: April 13, 2022 3:12 PM

Updated on: April 14, 2022 10:05 AM

APSRTC Charges Hike

---Advertisement---

APSRTC Charges Hike : డీజిల్ సెస్‌ పేరుతో ఏపీఎస్ ​ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లె వెలుగు బస్సుల్లో టికెట్‌పై రూ.2, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.5, దూరప్రాంత బస్సులకు రూ.10 పెంచుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. పల్లెవెలుగు, సిటీ బస్సుల్లో ఇకనుంచి కనీస ఛార్జీ రూ.10గా నిర్ణయించామన్నారు. పల్లెవెలుగు బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సెస్‌లు, రౌండ్‌ఆఫ్‌తో పల్లెవెలుగు బస్సుల్లో టికెట్‌ కనిష్ఠ ధర రూ.15గా ఉండనుందన్నారు. డీజిల్‌ సెస్‌ వల్ల ఆర్టీసీకి ఏటా రూ.720 కోట్లు వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.

ఏపీ ఆర్టీసీకి గత రెండేళ్లుగా ఆర్థికంగా చాలా కష్టాలు పెరిగాయని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. డీజిల్ ధర రెండేళ్లలో రూ.67 నుంచి రూ.107కు చేరిందిని.. బల్క్ ధర ఎక్కువగా ఉందని రీటైల్‌గా తీసుకుంటున్నామన్నారు. కరోనా వల్ల ఆర్టీసీకి 5,680 కోట్ల ఆదాయం తగ్గిందని వివరించారు.

Advertisement
APSRTC Charges Hike
APSRTC Charges Hike

అలాగే ఆర్టీసీలో ప్రస్తుతం నిర్వహణ కూడా కష్టమైందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే డీజిల్ సెస్ విధిస్తున్నామని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఆర్టీసీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను లీజుకు ఇస్తామని, కార్గో సేవల ద్వారా కూడా ఆదాయం పెంచుకుంటామన్నారు. ఆర్టీసీ.. రోజుకు 61 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుండగా….పెట్రో ధరలు, టైర్లు, ఇతర పరికరాల ధరలు కూడా బాగా పెరిగాయి.

Read Also : 

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :