AP Cabinet Reshuffle : ఏపీ కేబినెట్ భేటీ.. ఆ మంత్రుల రాజీనామా.. కాన్వాయ్‌ని వదిలేసి సాధారణ వ్యక్తుల్లా…!

Updated on: April 7, 2022

AP Cabinet Reshuffle : ఏపీ కేబినెట్ భేటీ ఉత్కంఠగా సాగింది. భేటీ ముగిసిన అనంతరం కేబినెట్ లో పాల్గొన్న మంత్రులు సీఎం జగన్‌కు తమ రాజీనామా లేఖలను అందించారు. ఏపీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ప్రస్తుత మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం జగన్ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులంతా తమ రాజీనామాలను సమర్పించిన అనంతరం కాన్వాయ్ వదిలేసి ఇలా సాదాసీదా నడిచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పులివెందుల, కొత్తపేట రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదించింది. వైఎస్సార్ సున్నావడ్డీ పథకానికి, మిల్లెట్ మిషన్ 2022-23 నుంచి అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. విద్య, వైద్య ప్రణాళిక శాఖల్లో నియామకాలకు జగన్ కేబినెట్ ఆమోదించింది.

2019లో జగన్ మంత్రివర్గం ఏర్పాటు అయింది. ఆ సమయంలోనే మంత్రులను రెండున్నర ఏళ్లపాటు కేబినెట్‌లో కొనసాగిస్తానని ప్రకటించారు. రెండున్నర ఏళ్ల తర్వాత కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకుంటానని వెల్లడించారు. అన్నమాట ప్రకారం.. ఇప్పుడు అప్పటి కేబినెట్ మంత్రులను రాజీనామా చేయమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. అందులో భాగంగానే మంత్రివర్గం కూర్పు చేయనున్నారు. ఈ కొత్త కేబినెట్‌లో ఐదు డిప్యూటీ సీఎంలు కొనసాగనున్నారు. కొత్త జిల్లాలకు కూడా ప్రాధాన్యత లభించింది.

వైసీపీ శాసనసభపక్షం సమావేశంలో మంత్రివర్గం పునర్వవ్యస్థీకరణపై అప్పట్లోనే జగన్ సీఎం ప్రకటించారు. కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరు వస్తారు. ప్రస్తుతం ఉన్న వారిలో మంత్రివర్గంలో ఎవరు కొనసాగుతారనే విషయమై మంత్రుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటి మంత్రులు మంత్రివర్గ సమావేశానికి హాజరు కావడానికి ముందే ఛాంబర్లలో ఫైల్స్ క్లియర్ చేశారు. మంత్రుల రాజీనామాలను జీఏడీ, గవర్నర్ ఆఫీసుకు పంపనుంది.

Advertisement

Read Also : Puspha Movie: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా… పదో తరగతి విద్యార్థి ఆన్సర్ పేపర్ చూసి కంగుతిన్న టీచర్.. ఏం జరిగిందంటే?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel