Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam March 5 Today Episode : ఆనందంలో వంటలక్క కుటుంబం..మోనిత ఏం చెయ్యనుంది..?

Karthika Deepam March 5 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ బాగానే దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. హిమ ఆనంద్ కావాలి అంటూ ఇంట్లో గోల గోల చేస్తూ ఉంటుంది.

Karthika Deepam March 5 Today Episode

నాకు ఆనంద్ కావాలి ఎలాగైనా తీసుకొద్దాం అంటూ అందరిని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ అందరూ మౌనంగా ఉండటం తో అందరి పై కోపంతో హిమ అక్కడినుంచి నేను తమ్ముడిని తీసుకువస్తాను అంటూ వెళ్ళిపోతుంది. ఆ తరువాత సౌందర్య కార్తీక్ చేతులు పట్టుకుని ఆనంద్ విషయంలో నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించు అని అడుగుతుంది.

పిల్లలు బాధ పడుతున్నారు మీ నలుగురు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళండి అని కార్తీక్ కు చెబుతుంది. మరొకవైపు మోనిత తనకు జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలి పోతూ ఉంటుంది. అంతే కాకుండా అంత ఈజీగా మిమ్మల్ని వదిలిపెట్టను, నాకు ఇంత అవమానం చేసిన వారిని క్షమించను అంటూ ఆవేశంతో గన్ను తీసుకుంటుంది. మరోవైపు కార్తీక్, దీప, పిల్లలను తీసుకొని విహారయాత్ర వెళుతూ ఉంటారు.

Advertisement

ముగ్గురు సంతోషంగా ఉన్నప్పటికీ హిమ ఈమాత్రం ఆనంద్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు కార్తీక్, దీప లు వారి జీవితంలో జరిగిన సంఘటనలు తలుచుకుని బాధ పడుతూ ఉంటారు. అప్పుడు హిమ అన్ని తలుచుకుంటారు ఆనంద్ ని మాత్రం తలుచుకోరు అని కోప్పడుతుంది. అప్పుడు దీప హిమ మనసును మార్చడానికి ప్రయత్నిస్తుంది. కార్తీక్ కూడా హిమని సంతోషంగా ఉంచడానికి, హిమ కు కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను అని అంటాడు.

దీప ఎంత వద్దు అని చెప్పినా వినకుండా హిమకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు కార్తీక్. దీపాలు ఎక్కడైతే మా బంధం విడిపోయిందో అక్కడికే వెళ్తున్నాను ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటుంది. మరోవైపు సౌందర్య, ఆనందరావు లు కష్టాలను తీర్చేందుకు గుడిలో పూజ చేయించి పూజారి తో మాట్లాడుతూ ఉంటారు.

కుటుంబంతో కలిసి రావాల్సింది అని పూజారి సౌందర్యతో చెప్పగా దీప పిల్లలు విహార యాత్రకు వెళ్లారు అని చెబుతుంది. అప్పుడు పూజారి దీప, కార్తీక్ ను ఎక్కడైతే విడిపోయారో మళ్లీ అక్కడికి వెళ్లడం అంత మంచిది కాదు వెంటనే తిరిగి వచ్చేయండి చెప్పండి లేదంటే ప్రమాదం జరగవచ్చు అని చెబుతాడు. పూజారి ఆ మాట చెప్పడంతో సౌందర్య, ఆనందరావు లు కంగారు పడుతూ ఉంటారు. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Karthika Deepam : ఆనంద్‌ని దత్తత ఇచ్చిన సౌందర్య.. మోనిత ఏం చేయనుంది..?

Exit mobile version