Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Fact check : ఇండియాలో 4G, 3G మొబైల్స్ నిలిచిపోనున్నాయా.. నిజమేంటి?

Fact check : ప్రస్తుతం 5జీ స్మార్ట్ ఫోన్ ల హవా నడుస్తోంది. 5జీ ఫోన్ ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అయితే తక్కువ ధరలో ఫోన్ కావాలనుకునే వారు చాలా మంది ఇప్పటికే 4జీ మొబైళ్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ లో ఇప్పటికే చాలా 4జీ ఫోన్ లను మొబైల్ తయారీ సంస్థలు తీసుకుంటున్నాయి. దేశంలోని కొన్ని నగరాల్లో 5జీ నెట్ వర్క్ ఇటీవలే లాంచ్ అయింది. క్రమంగా విస్తరించనుంది. ఈ తరుణంలో సోషల్ ... Read more

By Vinod Kumar

Published on: October 15, 2022 3:00 PM

Updated on: October 15, 2022 3:20 PM

4g and 3g smartphones production in stop in indian pib reveals

---Advertisement---

Fact check : ప్రస్తుతం 5జీ స్మార్ట్ ఫోన్ ల హవా నడుస్తోంది. 5జీ ఫోన్ ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అయితే తక్కువ ధరలో ఫోన్ కావాలనుకునే వారు చాలా మంది ఇప్పటికే 4జీ మొబైళ్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ లో ఇప్పటికే చాలా 4జీ ఫోన్ లను మొబైల్ తయారీ సంస్థలు తీసుకుంటున్నాయి. దేశంలోని కొన్ని నగరాల్లో 5జీ నెట్ వర్క్ ఇటీవలే లాంచ్ అయింది. క్రమంగా విస్తరించనుంది.

4g and 3g smartphones production in stop in indian pib reveals
4g and 3g smartphones production in stop in indian pib reveals

ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఓ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. 3జీ, 4జీ స్మార్ట్ ఫోన్ ల ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీలకు ప్రభుత్వం సూచనలు జారీ చేసిందని ఆ పోస్ట్ సారాంశం. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఇది నిజమేనా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏం చెప్పిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

4జీ, 5జీ ఫోన్ ల తయారీని నిలిపివేయాలని కంపెనీలకు భారత ప్రభుత్వం చెప్పిందన్న మెసేజ్ సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. దీంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఈ వైరల్ మమెసేజ్ అబద్ధమని వెల్లడించింది. ఫ్యాక్స్ చెక్ అకౌంట్ ద్వారా పీబీఐ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. 4జీ, 3జీ ఫోన్ ల ఉత్పత్తిని ఆపేయాలని కంపెనీలకు ప్రభుత్వం సూచిందన్న ఆ మెసేజ్.. ఫేక్ అని తేల్చింది. కంపెనీలకు భారత ప్రభుత్వం అలాంటి మార్గ దర్శకాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది.

Read Also : 5G Jio Phone : బంపర్ ఆఫర్ ఇస్తున్న జియో… అతి తక్కువ ధరలో 5జీ ఫోన్ ?

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.