Sai Pallavi: మహేష్ బాబు కోసం ముసుగు వేసుకొని వెళ్ళిన నాని హీరోయిన్.. ఎందుకో తెలుసా?

Sai pallavi: టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి తన నటనతో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందింది. తెలుగు తమిళ కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన సాయి పల్లవి తన నాచురల్ బ్యూటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తన నటనతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

సాధారణంగా సెలబ్రిటీలు సినిమాలు చూడటానికి థియేటర్ కి వెళ్ళాలి అంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు సెలబ్రెటీలు వారి అభిమానుల కంటపడకుండా మారువేషంలో వెళ్లి సినిమాలు చూస్తూ ఉంటారు. అలాగే సాయి పల్లవి కూడా తాను నటించిన సినిమా చూడడానికి ప్రేక్షకులు గుర్తు పట్టకుండా బుర్ఖా వేసుకొని వెళ్లి సినిమా చూసింది. ఇటీవల సాయి పల్లవి మరోసారి ఇటువంటి సాహసాన్ని చేసింది. ఎటువంటి హంగామా లేకుండా సినిమా చూడటానికి ముసుగు ధరించి మాస్క్ వేసుకోని వెళ్ళింది.

Advertisement

ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలయింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని థియేటర్లలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా 130 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుంది. అందరిలాగే సాయిపల్లవి కూడా మహేష్ బాబు సినిమా థియేటర్ లో చూడాలని ఆశ పడింది. ఈ క్రమంలో తనని ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ వేసుకొని ముఖానికి ముసుగు ధరించి హైదరాబాద్‌లోని ఆర్కే సీనీ మల్టీప్లెక్స్‌లో సినిమాను చూసింది. సినిమా పూర్తయిన తర్వాత బయటికి వచ్చిన సాయి పల్లవిని కొందరు అభిమానులు గుర్తు పట్టి ఫొటోలు తీశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel