Viral Video: ముసుగు వేసి మొసలితో పరచకాలు.. ఆ మొసలి చేసిన పని చూస్తే షాక్..!

Viral Video: నీటిలోని మొసలి నిగిడి యేనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. నీళ్లలో ఉన్నప్పుడు మొసలి తన బలంతో ఏనుగు మీద కూడ దాడి చేస్తుంది కానీ బయట ఉన్నప్పుడు దానికి ఎటువంటి బలం ఉండదు అని అంటుంటారు. కానీ ఆ మాటలలో నిజం లేదని ఒక వీడియో ద్వారా నిరూపించబడింది. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో పొలాల మధ్య సేదతీరిన ఒక మొసలిని చూసిన కొందరు వ్యక్తులు దానితో పరాచకాలు చేశారు. వారిలో ఒక వ్యక్తి ముసలి పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ముసలి తలని గుడ్డతో కప్పి దానిని పట్టుకోడానికి వెళ్ళాడు. మరొక వ్యక్తి కూడ ముసలిని పట్టుకోడానికి వెళ్ళాడు. కానీ మొదటి వ్యక్తి మొసలిని పట్టుకోగానే వెంటనే అది సదరు వ్యక్తి మీద దాడి చెసి అతని చేయి పట్టుకొని కొరికింది వెంటనే ఆ వ్యక్తి భయపడి దూరంగా వచ్చేశాడు.


ఈ మొత్తం సంఘటనని ఒక వ్యక్తి వీడియో తీశాడు. బయట ఉన్న మొసలికి బలం ఉండదని భ్రమపడి దానిని పట్టుకోవటానికి ప్రయత్నించారు. కానీ మొసలి బయట ఉన్నా కూడ దాడి చేయగలదు అని ఈ వీడియో ద్వారా నిరూపించబడింది. ఈ వీడియో ‘jamie gnuman 197’ అనే నెటిజన్ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేశాడు. ఇప్పటివరకు వేల సంఖ్యలో వ్యూస్ పొందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel