Acharya Movie publicTalk: విశ్వరూపం చూపించిన మెగాస్టార్.. అభిమానులకు పూనకాలే!

Acharya Movie publicTalk: మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ప్రధానపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తోంది. దేవాలయాలలో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే షో చూసిన ప్రేక్షకులు ఈ సినిమాపై వారి అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియ చేస్తున్నారు. మరి ట్విట్టర్ రివ్యూస్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

ఆచార్య సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా సెకండ్ హాఫ్ తండ్రీకొడుకుల నటనకు ప్రేక్షకులకు పూనకాలు రావడం గ్యారెంటీ. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన సిద్ధ పాత్ర సినిమాకి ప్రాణం పోసిందని చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ చిరంజీవి ఫైట్ సన్నివేశాలు, చరణ్ స్క్రీన్ ప్రజెంటేషన్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక సినిమాకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు మరొక జత బట్టలు తీసుకెళ్ళండి వారి నటనను చూసి బట్టలు చింపుకోవడం గ్యారెంటీ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

 

Advertisement

ఈ విధంగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గురించి కొందరు పాజిటివ్ రివ్యూలు ఇవ్వగా, మరికొందరు నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు. కొరటాల నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదని కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. గతంలో కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమాతో ఈ సినిమాని పోల్చలేమని కథ చాలా వీక్ గా ఉందని ,ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొడుతుందని సెకండాఫ్ క్లైమాక్స్ మాత్రం కాస్త ఎమోషనల్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ ఆచార్య పరవాలేదు అనే టాక్ సొంతం చేసుకుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel