Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Protein Rich Foods : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే…

Protein Rich Foods

Protein Rich Foods : ఇటీవలి కాలంలో అనేక అధ్యయనాల్లో ఆహారంలో ప్రొటీన్ల కొరత అధికంగా ఉంటుందని తేలింది. మనిషి ఆరోగ్యానికి ప్రొటీన్లు చాలా ముఖ్యమైనవి. ప్రతి మనిషికి ప్రతి కిలో బరువుకు ఒక గ్రాము ప్రొటీను అవసరమౌతుంది. ఉదహరణకు 55 కిలోల బరువున్న వారికి రోజుకు 55 గ్రాముల ప్రొటీన్ అవసరం అవుతుంది. ప్రొటీన్ కొరత ఏర్పడితే అలసట, కండరాల క్షీణత, ఏర్పడి చివరకు ప్రాణాంతంగా మారుతుంది. శరీరానికి పుష్కలంగా ప్రొటీన్లు అందితే రోగనిరోధక వ్యవస్ధ బలపడుతుంది.

కాగా శరీరానికి కావాల్సినన్ని ప్రొటీన్లను అందించటంలో పాలు, పాల ఉత్పత్తులు ఎంతో దోహదపడతాయి. అయితే ఇటీవలి కాలంలో అనేక మంది పాలు తాగే విషయంలో అనేక అపోహలు నెలకొన్నాయి. పాలు, పాల ఉత్పత్తులు రోజు వారిగా తీసుకోవటం వల్ల శరీరంలో కొవ్వులు పెరిగిపోతాయని, అందువల్ల వాటిని దూరంగా ఉంచాలన్న భావనతో ఉన్నారు. వాస్తవానికి ఆభావన సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. పచ్చిపాలల్లో కొవ్వు ఉండే మాట వాస్తమే అయినప్పటికీ , వెన్న తీసిన పాలల్లో కొవ్వులు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.

milk-and-milk-products-health-tips

టోన్డ్ పాలు, పాల అధారిత ఉత్పత్తులైన పెరుగు, పనీర్ లను తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సినన్ని ప్రొటీన్ లు అందతాయి. పాలు తాగటం వల్ల శరీరానికి అందే ప్రొటీన్లు , కొవ్వు వల్ల కలిగే దుష్ప్రభావాలను తొలగిస్తుంది. వయసుతో పాటు శరీరంలో పాలను అరిగించుకునే సామర్ధ్యం కల ఎంజైమ్ లు తగ్గిపోతూ ఉంటాయని చాలా మందిలో అపోహ ఉంది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. పాలు పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు ఎంతో మేలు చేస్తాయి. ఉదయాన్నే ఒక గ్లాసు పాలు, భోజనంలో పన్నీర్ కూర, పెరుగు వంటివి తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయని సూచిస్తున్నారు. కాబట్టి ప్రొటీన్ల కోసం పాలు, పాలఉత్పత్తులను మించినవి లేవని గుర్తించటం మంచిది.

Advertisement

Read Also : Virgin Story : హీరోయిన్‌ని అసభ్యకరమైన ప్రశ్న అడిగిన యాంకర్… ఆ తర్వాత ఏమైందంటే?

Exit mobile version