Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అందరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలలో బిపి, షుగర్ వంటి సమస్యలు అధికం. నూటికి 70 శాతం మంది ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అదుపులో ఉంచుకోవటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలను కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ వ్యాధిని నియంత్రించడానికి డాక్టర్ సలహా తీసుకుంటూ మెంతి నీటిని తాగటం వల్ల షుగర్ వ్యాధి ని బాగా నియంత్రించవచ్చు.
మెంతులలో ఫైబర్, విటమిన్ కె, ఎల్ ఆస్కార్బిక్ ఆమ్లం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ప్రతిరోజు ఉదయం మెంతి నీటిని తాగడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉండటమే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం, అజీర్తి, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
ఈ మెంతి నీటిని తాగడం వల్ల శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. మెంతులలో ఉండే యాంటీఆక్సిడెంట్ అనేక రోగాల నుండి మన శరీరానికి కాపాడుతాయి.