Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Health tips: అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆహార పదార్థాలు ఇవే..!

ఉప్పుతో అధిక రక్తపోటు ముప్పు తప్పదు… మందులు వాడుతూనే శారీరక శ్రమ, సమపాళ్లలో ఆహారం తీసుకుంటే అధిక రక్తపోటును అదుపులోకి తీసుకొని రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సోడియం ఉన్న ఆహారం తగ్గించి పొటాషియం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆహార నియమాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలీదేవి పలు విషయాలు వెల్లడించారు.

ఎక్కువ కొవ్వు పదార్థాలు తని వ్యాయామం చేయకపోయినా రక్ నాళాలు గట్టి పడిపోతాయి. అలాగే రక్త నాళాల్లో సాగే గుణం తగ్గిపోయినపుడు అధిక రక్తపోటు వస్తుంది. ఇది మనం తీసుకునే ఆహారంతోనే ఏర్పడుతుంది. ఉప్పును వయసు ఆధారంగా తీసుకోవాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోవద్దు. మధుమేహం, వయసు మళ్లిన వారున్న వారికి 3 గ్రాముల లోపే ఇవ్వాలియ మాంసం అధికంగా తింటే రక్త నాళాల్లో కొవ్వు పట్టేస్తుంది. నరాల స్థాయిని తగ్గిస్తుంది. అరటి, జామ, నేరేడు పండ్లు బీపీని అదుపు చేసే గుణం ఉంటుంది. వంటలకు ఆలీవ్, నువ్వుల నూనెను వాడుకోవాలి.

Advertisement
Exit mobile version