Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Henna Health Benefits : గోరింటాకుతో ఇన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయా?

Henna health benefits : ఆషాడ మాసం వచ్చిందనగానే మహిళలు ఎక్కువగా గోరింటాకు పెట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎర్రగా పండిన చేతులను చూసుకొని తెగ మురిసిపోతారు. అయితే ఇది కేవలం అందం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Henna health benifits _ Benefits of Henna For Hair Health

ఆషాడమాసం అంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయినట్టే అయితే వర్షాకాలంలో జరిగే వాతావరణ మార్పుల వలన మానవ శరీరం అనేక రోగాల బారిన పడుతుంది. అయితే గోరింటాకు లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వలన రోగాల బారిన పడకుండా మానవ శరీరాన్ని కాపాడుతుంది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

Henna Health Benefits : గోరింటాకుతో అందమే కాదు.. ఆరోగ్యం కూడా.. ఎప్పుడు పెట్టుకోవాలంటే?

వర్షాకాలం ఎక్కువగా మహిళలు నీళ్లలో నానుతూ పని చేస్తారు. దీనివలన కాళ్లు పగలడం, గోళ్ళు పుచ్చి పోవడం వంటివి జరుగుతాయి. ఈ టైం లో గోరింటాకు పెట్టుకోవడం వలన వీటిని తగ్గించుకోవచ్చు. శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను నివారించడంలో గోరింటాకు ఎంతగానో సహాయపడుతుంది. చర్మంపై వచ్చే అలర్జీలను కూడా తగ్గిస్తుంది.

Advertisement

స్త్రీలలో ఏర్పడే జుట్టు సమస్యలను కూడా నివారించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. గోరింటాకు తరచుగా ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. అంతేకాకుండా ఆవనూనెలో గోరింటాకు వేసి మరిగించాలి ఆ తర్వాత వచ్చిన నూనెను వడగట్టుకుని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచాలి. ఈ విధంగా తయారు చేసుకున్న నూనెను అప్లై చేయడం వలన జుట్టు రాలే సమస్య ను దూరం చేయవచ్చు. అంతేకాకుండా కొత్త జుట్టు రావడానికి కూడా ఇది దోహదపడుతుంది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

అంతేకాకుండా గోరింటాకు స్త్రీలలో ఏర్పడే గర్భాశయ దోషాలను కూడా నివారిస్తుంది. స్త్రీ అరచేతి మధ్య భాగంలో గర్భాశయానికి రక్తాన్ని చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. మనం అరచేతికి గోరింటాకు పెట్టుకున్నప్పుడు నాడులలో ఉండే అతి ఉష్ణాన్ని లాగడం వలన గర్భాశయ దోషాలు తొలగిపోతాయి. ఆషాడం అనే కాకుండా ఆషాడం అనే కాకుండా ప్రతిసారి గోరింటాకు పెట్టుకోవడం వలన మంచి లాభాలు కలుగుతాయి.

Read Also : Health Tips: అరికాళ్ళు చీలి నొప్పి వేధిస్తోందా? ఈ చిట్కాల ద్వారా మీ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version