Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Mahesh Babu : ఆ హీరోయిన్‌తో సినిమా చేయనని తెగేసి చెప్పిన మహేశ్‌బాబు.. కంగుతిన్న డైరెక్టర్..!

Mahesh Babu : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు పక్కన హీరోయిన్ ఛాన్స్ వచ్చిదంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అలాంటి మహేష్ బాబు తన మూవీలో హీరోయిన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తన అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేందుకు తెగ కష్టపడుతుంటాడు. తాను ఏ సినిమా చేసిన అందులో తన జోడీగా నటించే హీరోయిన్ ఎవరైతే ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. తెరపై కెమిస్ట్రీ పండించేందుకు హీరోయిన్ అందంతో పాటు ఆడియెన్స్ ఆకట్టుకునేలా ఉండాలి. ఆ విషయంలోనే మహేశ్ చాలా కచ్చితంగా ఉంటాడని సందేహం అక్కర్లేదు. ఇప్పటివరకూ మహేశ్ చాలా మంది టాప్ హీరోయిన్లతో నటించాడు.

Why Mahesh Babu Rejected that Heroin in His Movie

అందులో బెస్ట్ రియల్ కపుల్ అనిపించిన జోడీ మహేశ్ బాబు, భూమిక.. వీరిద్దరూ కలిసి ఒక్కడు మూవీలో నటించారు. ఆ మూవీ ఎంత బిగ్ హిట్ అయిందో చెప్పన్కర్లేదు. ఆ మూవీలో మంచి సక్సెస్ అందుకున్న మహేశ్.. అంతకంటే ముందే మురాళిలో నటించాడు. ఆ మూవీలో సోనాలి బింద్రేతో ఫుల్ రొమాన్స్ చేశాడు. అది కూడా హిట్ ఫెయిర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత ఒక్కడు మూవీ కోసం హీరోయిన్ ఎవరా అని ఆలోచనలో పడ్డారు.

Mahesh Babu : మళ్లీ అదే హీరోయిన్.. ముఖం మాడ్చిన మహేశ్..

‘ఒక్కడు’ మూవీ దర్శకుడు గుణశేఖర్ మహేశ్ కు జోడీగా మళ్లీ సోనాలి బింద్రేను తీసుకుందామని అన్నాడట.. అంతే.. అప్పటివరకూ కూల్‌గా ఉన్న మహేశ్ ఒక్కసారిగా గరం గరం అయ్యాడట.. ఈసారి తన సినిమాలో సోనాలి వద్దని తెగేసి చెప్పేశాడట.. గుణ శేఖర్ ఎంతగా చెప్పిన మహేశ్ వినలేదట.. ఎవరైనా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని సలహా ఇచ్చాడట.. ఇప్పటికే మురారి మూవీలో సోనాలి బింద్రేను ఆడియోన్స్ చూశారు.

Advertisement
Why Mahesh Babu Rejected that Heroin in His Movie

మళ్లీ అదే హీరోయిన్ జోడీగా ఒక్కడులో ఉంటే.. ప్రేక్షకులకు బోరుగా అనిపిస్తుందని చెప్పాడట. ఆ క్రమంలోనే ఒక్కడు మూవీలో ఏ హీరోయిన్ బాగుంటుందని ఆలోచించగా.. భూమిక చావ్లా పేరు హైలెట్ అయింది. దాంతో భూమికను ఒక్కడు మూవీలోకి తీసుకున్నారు. ఆ మూవీలో భూమికతో మహేశ్ రొమాన్స్ అద్భుతంగా వచ్చింది. వీరిద్దరి జోడీ ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీలో పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఏది ఏమైనా మహేశ్ ఆలోచన కరెక్ట్ అని అందరూ అనకమానరు.. ఆ రోజు హీరోయిన్ విషయంలో మహేశ్ అంత కఠినంగా ఉన్నాడు కాబట్టే.. ఇప్పటికీ ఒక్కడు అనే మూవీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

Read Also : Mahesh Babu Six Pack : మిల్క్ బాయ్ మహేష్‌.. ఫస్ట్ టైం షర్ట్ లేకుండా.. స్విమ్మింగ్ పూల్లో సిక్స్ ప్యాక్ లుక్..!

Advertisement
Exit mobile version