Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Nayanathara: నయన్ కి విఘ్నేష్ గోరు ముద్దలు… మీ ప్రేమని తట్టుకోలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్లు!

Nayanathara: అందాల తార నయన తార గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. బుల్లి తెర యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించిన ఆమె తన అందం, అభినయంతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. గొప్ప నటీమణిగా పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేస్కుంది. అయితే ఈ భామ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి ఎప్పుడు బయటకు వెళ్లినా, ఏం చేసినా అందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంటుకుంటారు.

అయితే తాజాగా నయన్, విగ్నేష్ ల ఓ వీడియో వైరల్ గా మారింది. ఇప్పుడు ఆహారం తీసుకునే సమయం అంటూ తనకి నచ్చిన సీ ఫుడ్ తినిపించడంలో తనకు ఎంతో సంతోషమం ఉందని చెప్తూ… నయన్ కి విగ్నేష్ గోరు ముద్దులు తినిపించాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు టాక్ నడుస్తోంది. కానీ ఇంత వరకు అధికారికంగా వీరిద్దరూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement
Exit mobile version