Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Tamannaah Bhatia : పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో పెళ్లి పుకార్లపై తమన్నా భాటియా రియాక్షన్.. అసలు నిజం బయటపెట్టేసింది..!

Tamannaah Bhatia

Tamannaah Bhatia (Photo Credit : Google Images ) 

Tamannaah Bhatia : పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ గురించి ఈ మధ్య నెట్టింట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం బాలీవుడ్ అందాల నటి (Tamannaah Bhatia) తమన్నా భాటియా. ఇటీవలే ది లల్లాంటాప్‌కి తమన్నా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో ఆమె అబ్దుల్ రజాక్‌తో తన ఎఫైర్ గురించి మౌనం వీడింది. 2020 సంవత్సరంలో తమన్నా పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌‌ను వివాహం (Tamannaah Bhatia) చేసుకున్నట్లు ఒక వార్త వచ్చింది. కానీ, ఇప్పుడు తమన్నా ఈ పెళ్లి పుకార్ల వెనుక అసలు నిజం ఏమిటో బయటపెట్టింది.

ఇంటర్వ్యూలో అబ్దుల్ రజాక్‌తో తన ఎఫైర్ పూర్తిగా అబద్ధమని తమన్నా స్పష్టం చేసింది. ఒక నగల దుకాణం ప్రారంభోత్సవం సందర్భంగా తాను అబ్దుల్ రజాక్‌ను కలిశానని తమన్నా చెప్పింది.

Advertisement

అబ్దుల్ రజాక్‌తో ఎఫైర్ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘సరదాగా అబ్దుల్ రజాక్.. ఇంటర్నెట్ ఒక ఫన్నీ ప్రదేశం. దాని ప్రకారం.. నేను కొంతకాలం అబ్దుల్ రజాక్‌ను వివాహం చేసుకున్నాను. నన్ను క్షమించండి సార్. మీకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్నారు. మీ జీవితం గురించి నాకు తెలియదు. కానీ అది చాలా ఇబ్బందికరంగా ఉంది’ అని పేర్కొంది.

Tamannaah Bhatia : కోహ్లీతో కూడా డేటింగ్ పుకార్లు :

అబ్దుల్ రజాక్ మాత్రమే కాదు.. క్రికెటర్ విరాట్ కోహ్లీతో కూడా తనకు డేటింగ్ ముడిపెట్టారని తమన్నా ఆరోపించింది. ఈ పుకార్లపై స్పందిస్తూ.. “నేను కోహ్లీని ఒక్కసారే కలిశాను కాబట్టి నాకు చాలా బాధగా ఉంది. ఆ తర్వాత నేను విరాట్‌ను ఎప్పుడూ కలవలేదు” అని ఆమె పేర్కొంది.

Read Also : Shibu Soren Death : శిబు సోరెన్ ఇకలేరు.. ఆయన ఎవరు? ఎలా మరణించారు? జార్ఖండ్ ‘గురూజీ’కి ఏమైందంటే?

Advertisement

వాస్తవానికి ఆధారం లేని మీడియా లింక్‌లతో తన అసౌకర్యాన్ని పంచుకుంది. “మీడియా మీకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తితో మిమ్మల్ని లింక్ చేసినప్పుడు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది” అని తమన్నా పేర్కొంది.

ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి చాలా సమయం పట్టిందని ఆమె తెలిపింది. తమన్నా తన గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెబుతోంది. తన వృత్తిలో ప్రజాభిప్రాయం ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. పబ్లిక్ ఇమేజ్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తమన్నా చెప్పొకొచ్చింది.

Tamannaah Bhatia (Photo Credit : Google Images )

“నేను ఎప్పటికప్పుడు నన్ను గూగుల్‌లో చూసుకుంటూ ఉంటాను” అని ఆమె చెప్పింది. ప్రేక్షకులను ఆలోచనలను అంచనా వేయడంతో పాటు ఏవైనా పుకార్లు వ్యాపిస్తే ఎలా సంసిద్ధంగా ఉండాలో కూడా తెలిపింది. మీ కోసం సినిమాలు చేయకపోతే ప్రేక్షకులు తమను ఇష్టపడుతున్నారో లేదో మీరు తెలుసుకోవాలి” అని తమన్నా వివరించింది.

Advertisement

Pak cricketer Abdul Razzaq : పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఎవరు?

అబ్దుల్ రజాక్ పాకిస్తాన్ క్రికెట్ జట్టులో గ్రేట్ ఆల్ రౌండర్. 1996లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రజాక్ మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చేయగలడు. తన ఆల్ రౌండ్ ఆటతో పాకిస్తాన్‌ను చాలాసార్లు గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

అబ్దుల్ రజాక్ కెరీర్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ తరపున 265 వన్డేలు ఆడి 5,080 పరుగులు చేసి 269 వికెట్లు పడగొట్టాడు. 46 టెస్ట్ మ్యాచ్‌లలో కూడా ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో అబ్దుల్ రజాక్ 1946 పరుగులు చేసి బౌలింగ్‌లో 100 వికెట్లు పడగొట్టాడు. T20 ఫార్మాట్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ తరపున 32 మ్యాచ్‌లలో 393 పరుగులు చేసి 20 వికెట్లు కూడా పడగొట్టాడు.

Advertisement
Exit mobile version