Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sreeja Kalyan Dev : శ్రీజ కూతురితో కనిపించిన కల్యాణ్ దేవ్.. ఇద్దరూ ఒక్కటయ్యారా.? వీడియో!

Sreeja Kalyan Dev : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. గతకొన్ని నెలలుగా శ్రీజ, కల్యాణ్ దేవ్ వేర్వేరుగా ఉంటున్నారు. ఇప్పటికే వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో అధికారికంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అలాగే కల్యాణ్ దేవ్ కూడా బహిరంగంగా శ్రీజతో విడాకులు తీసుకున్నట్టుగా వెల్లడించలేదు. కానీ, వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

Mega Daughter Sreeja Husband Kalyan Dev Meets Daughter Navishka, Insta Video Viral

అందులోనూ శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు రావడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. శ్రీజ, కల్యాన్ దేవ్ ఇద్దరూ వేర్వేరుగా ఎవరి ఇంట్లో వారు ఉంటున్నారు. శ్రీజ పుట్టింట్లో ఉంటే.. కల్యాన్ దేవ్ తన తల్లిదండ్రులతో ఉంటున్నాడు. అయితే వీరిద్దరి సంతానమైన నావిష్క మాత్రం శ్రీజ వద్ద ఉంటోంది. రెండు రోజుల క్రితం నావిష్క కల్యాణ్ దేవ్‌తో కనిపించింది. తన ముద్దుల కూతుర్ని ఎత్తుకుని మరి కల్యాణ్ దేవ్ ఆడిస్తున్న వీడియో తన ఇన్ స్టాలో పోస్టు చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

నావిష్క కల్యాణ్ దేవ్ దగ్గరికి రావడంతో శ్రీజ కూడా వచ్చేసిందని, ఇద్దరూ కలిసిపోయారని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి మెగా ఫ్యామిలీ వేడుకల్లో ఎక్కడా కూడా కల్యాన్ దేవ్ కనిపించలేదు. శ్రీజ పెద్ద కుమార్తె పుట్టిన రోజు వేడుకల్లో కూడా కల్యాన్ లేడు. కల్యాణ్ దేవ్ తన తల్లి పుట్టినరోజు వేడుకులు జరుపుకోగా.. శ్రీజ రాలేదు.

Advertisement

Sreeja Kalyan Dev : గారాల పట్టి నావిష్కతో కల్యాణ్ దేవ్ కబర్లు..  ఆక్సిజన్ ఫ్రీ అంటూ వీడియో..

Mega Daughter Sreeja Husband Kalyan Dev Meets Daughter Navishka, Insta Video Viral

ఈ రెండింటిని పరిశీలిస్తే.. శ్రీజ, కల్యాణ్ దేవ్ ఇంకా దూరంగా ఉన్నారని భావించవచ్చు. కానీ, శ్రీజ గారాల పట్టి నావిష్క తండ్రి చెంతకు చేరడంతో ఇద్దరూ కలిసిపోయారా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా.. భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ వారి పిల్లల ఆలనాపాలనా చూసుకునే హక్కు ఇరువురికి ఉంటుంది. అందులో భాగంగానే కల్యాణ్ దేవ్ తన కూతురిని కలిసినట్టు తెలుస్తోంది. కల్యాణ్ దేవ్ తన కూతురితో ఆడుకుంటున్న వీడియోలో శ్రీజ మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం కల్యాన్ దేవ్ తన కుమార్తె నావిష్కతో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జోరుగా వర్షం పడుతుండగా.. చల్లటి వాతావరణంలో కూతురితో ఆడుకుంటూ కల్యాన్ దేవ్ కనిపించాడు. ఆక్సిజన్ ప్రీ అంటూ కూతురితో చెప్పిన వీడియో చాలా క్యూట్‌గా ఉంది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

మరోవైపు శ్రీజ మూడో పెళ్ళికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన క్లోజ్ ఫ్రెండ్‌ను శ్రీజ పెళ్లి చేసుకోబోతుందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ శ్రావణ మాసంలోనే శ్రీజ పెళ్లిపీటలెక్కబోతుందంటూ టాక్ నడుస్తోంది. చిరంజీవి మూడో పెళ్లి చేసుకోవడంపై చిరంజీవికి మాత్రం ఇష్టం లేదట.. అయినప్పటికీ బాబాయ్ పవన్ కల్యాణ్ ఎంట్రీతో శ్రీజ మూడో పెళ్లి చేసేందుకు చిరంజీవి అంగీకరించారంటూ టాక్ వినిపిస్తోంది. ఎంతైనా మన అమ్మాయి సంతోషమే మనకు ముఖ్యమని పవన్ చెప్పడంతో చిరు.. శ్రీజ మూడో పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఇందులో ఎంతవరకూ వాస్తవమో తెలియాలంటే మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే..

Read Also : Sreeja Third Marriage : షాకింగ్ ట్విస్ట్.. శ్రావణంలో శ్రీజ మూడో పెళ్లి.. చిరంజీవిని ఒప్పించింది ఆయనే..?!

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version