Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Samantha : పెళ్లంటేనే ఒక కేజీఎఫ్ అంటూ సామ్ షాకింగ్ కామెంట్లు…!

Samantha : తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. అయితే విడాకుల తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న సామ్.. ఇప్పటికే శాకుంతలం సినిమాను పూర్తి చేసింది. ప్రస్తుతం యశోద, ఖుషి చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో ఒక్క పాట మినహా మిగిలిన చిత్రీకరణ మొత్తం పూర్తయిందని తెలిపింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సందండి చేసింది సమంత. ఎంతో సరదాగా, ఉత్సాహాంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అందులో తన ప్రేమ, పెళ్లి, విడాకులకు సంబంధించిన పలు విషయాల గురించి వెల్లడించింది. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విడాకుల ప్రక్రియ అంత సామరస్యంగా ఏ జరగలేదని, విడాకుల తర్వాత ఎంతో కఠినంగా గడిపానని తెలిపింది. అలాగే గతంలో కంటే ప్రస్తుతం మరింత బలంగా ఉన్నాని వెల్లడించింది. ఒకవేళ చైతన్యను తనను ఒకే గదిలో ఉంచితే అక్కడ ఎలాంటి పదునైన ఆయుధాలు లేకుండా చూస్కోవాలి. భవిష్యత్తులో ఇద్దరి మధ్య సరైన సఖ్యత వస్తుందో లేదో తెలియదని చెప్పింది.

Advertisement

Read Also : ChaiSam: చైసామ్ గురించి షాకింగ్ విషయం బయటపెట్టిన మురళీ మోహన్.. నాగ్ అడిగారనే చేశానంటూ!

Exit mobile version