Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Samantha : సామ్ సాంగ్ సల్మాన్ ను ఇన్ స్పైర్ చేసిందట.. లవ్ సింబల్ తో రిప్లై!

Samantha : ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి.. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ది ఫ్యామిలీ మేన్ 2 తో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టిన ఈ అమ్మడుపై కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. తాజాగా ఆయన ఓ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇన్ స్పైర్ చేసిన పాట ఏదైనా ఉందంటే… ఆయన బదులుగా సామ్ సాంగ్ గురించి చెప్పారు. సమంత పుష్ప 2 సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్.. ఊ అంటావా మావా.. ఊహూ అంటావా పాట తనను ఇన్ స్పైర్ చేసిందని వివరించాడు. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Samantha latest tweet on salman khan response on her song

అయితే ఈ వీడియో చూసిన సమంత… రీట్వీట్ చేస్తూ… ఎరుపు రంగులో ఉన్న హార్ట్ ఎమోజీస్ తో షేర్ చేసింది. కాగా సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. యశోద, శాకుంతలం, ఖుషితో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. అంతే కాదండోయ్ పలు హాలీవుడ్ ప్రాజెక్టుల్లోనూ స్టార్ హీరోయిన్ సామ్ నటిస్తున్న విషయం ఇది వరకు తెలిసిందే.

Read Also :  Samantha: సమంత విషయంలోనే ఎందుకిలా జరుగుతోంది… నాస్టీ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజ

Advertisement
Exit mobile version