G
Telugu News » Entertainment » rrr movie rrr movie story line start with malli role who is malli what her background all details here
⚡ Entertainment, Latest, Topstory

RRR Movie : ఆర్ఆర్ఆర్ స్టోరీ మొత్తం ఈ మల్లితోనే.. ఎవరీ మల్లి తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

RRR Movie, RRR Story Malli Role, మల్లి పాత్రలో అమ్మాయి ఎవరంటే? మల్లి రోల్, ట్వింకిల్ శర్మ  Malli Background, ఆర్ఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మూవీ, ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

RRR Movie : ఆర్ఆర్ఆర్.. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి.. ఈ ముగ్గురు కలిస్తే.. ట్రిపుల్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ టాక్ వినిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. పాన్ ఇండియా తరహాలో ఆర్ఆర్ఆర్ మూవీకి ఫుల్ క్రేజ్ పెరిగింది. ఆర్‌ఆర్‌ఆర్‌ భారీగా వసూళ్లతో రికార్డులను తిరగరాస్తోంది.

జక్కన్న డైరెక్షన్ లో ఎన్టీఆర్, చెర్రీల పర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ మూవీలో ఇద్దరు హీరోలు పోరాటం చేసేది ఒక చిన్నారి కోసం.. ఆ చిన్నారి పేరు.. మల్లి.. ఆర్ఆర్ఆర్ మూవీ మొదలయ్యేది ఈ మల్లి పాత్రతోనే.. సినిమా నేపథ్యం మొత్తం ఈ చిన్నారి చుట్టూనే సాగుతుంది. గిరిజన బిడ్డ అయిన మల్లిని బ్రిటీష్ దొరసాని తీసుకెళ్లినప్పటి నుంచి స్టోరీ మొదలవుతుంది.

rrr-movie-rrr-movie-story-line-start-with-malli-role-who-is-malli-what-her-background-all-details-here

ఆర్ఆర్ఆర్ మూవీకి మల్లి క్యారెక్టర్ బేస్.. మల్లి పాత్ర నటించిన ఈ అమ్మాయి అద్భుతంగా అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు అందరూ ఈ అమ్మాయి గురించే సెర్చ్ చేస్తున్నారట.. ఎవరు మల్లి అంటూ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. మల్లి పాత్రలో ఒదిగిపోయిన ఈ అమ్మాయి పేరు.. ట్వింకిల్ శర్మ.. చండీగఢ్ నుంచి వచ్చింది. డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. చాలా టీవీ యాడ్స్‌లోనూ నటించింది.

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ యాడ్‌లో నటించిన ఈ ట్వింకిల్ శర్మ పెర్ఫార్మెన్స్ చూసి రాజమౌళి ఫిదా అయ్యాడట.. వెంటనే తన ఆర్ఆర్ఆర్ మూవీకి సరిగ్గా ఫిట్ అవుతుందని ఆడిషన్ కోసం పిలిపించాడట.. మల్లి పాత్రకు వెంటనే సెలక్ట్ చేసేశారట.. ఆర్ఆర్ఆర్ మూవీలో మల్లి ఫేమస్ డైలాగ్ ప్రతిఒక్కరిని కదిలించింది.. నన్ను ఈడ ఇడిసిపోకన్న అమ్మా యాదికొస్తాంది అంటూ మల్లీ చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకుంది.

Advertisement

Read Also : Rashmika: బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక.. అదృష్టం మామూలుగా లేదుగా!

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷JR NTRMalli Backgroundram charanRRR movieRRR Story Malli RoleSS Rajamouli
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు