Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Radheshyam : ‘రాధేశ్యామ్‌’ ఫ్యాన్స్ అండ్‌ పబ్లిక్ టాక్‌

Radhe shyam movie public talk

Radhe shyam movie public talk

Radheshyam : ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యాం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టాక్ విభిన్నంగా ఉంది. బెనిఫిట్ షో చూసిన వారు సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేందుకు ప్రయత్నించినా కొందరు అభిమానులు మాత్రం పాజిటివ్ గా స్పందించారు.

సినిమా చాలా స్లో ఉంది అనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఇక ఫాన్స్ విషయానికి వస్తే ప్రభాస్ ని చాలా స్టైలిష్ గా చూపించడంతో పాటు ఒక మంచి లవ్ స్టోరీ లో చూపించడం బాగుందంటూ.. విజువల్ వండర్ గా సినిమా ను చూపించారు అంటూ చిత్ర యూనిట్ సభ్యులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో ప్రేక్షకులు స్పందిస్తూ రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో కాస్త బోరింగ్‌ గా అనిపించిందని.. కాకపోతే సినిమా విజువల్ వండర్ గా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా ను కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌గ ఆ తెరకెక్కించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ వ్యాల్యూస్ విషయంలో ఫ్యాన్స్‌ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. థమన్‌ అందించిన సంగీతం మొదలుకొని సినిమాటోగ్రఫీ మరియు గ్రాఫిక్స్ ఇలా ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉందంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులు మాత్రం పాటల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెకండాఫ్ మరియు క్లైమాక్స్ లో మరీ స్లోగా కథనం ఉందని వారు అంటున్నారు. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో వసూళ్ల విషయంలో ఎలాంటి డోకా లేదు అంటూ ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Exit mobile version