Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Trolls on thaman: కాపీ కొట్టేటప్పుడు కాస్త చూస్కో తమన్.. నెటిజెన్స్ ట్రోలింగ్!

Trolls on thaman: మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించి గాడ్ ఫాదర్ సినిమా టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇదులో వచ్చే మ్యూజిక్ పై నెటిజెన్లు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా బీజీఎం.. అచ్చుగుద్దినట్లు వరణ్ తేజ్ గని టైటిల్ సాంగ్ లా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. తీరు మార్చకుండా ఉన్నది ఉన్నట్లు దింపేశాడని చెబుతున్నారు.

అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం తమన్ పై విపరీతంగా ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమాకు కూడా కాపీ కొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోనీ కాపీ కొడితే కొట్టావు కానీ… మక్కీకి మక్కీ దింపడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాస్త చూసుకోవయ్యా… కాపీ కొట్టే ముందు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే గని సినిమాకు మ్యూజిక్ ఇచ్చింది కూడా తమన్ యే కావడం గమనార్హం.

Advertisement

గతంలో కూడా చాలా సినిమాలకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ కాపీ అంటూ కామెంట్లు చేశారు. అతడిని చాలా మంది కాపీ క్యాట్ తమన్ అని పిలస్తుంటారు. సినిమా టీజర్ లో చూసే నెటిజెన్లు తమన్ ని ఇంతగా ట్రోల్ చేస్తుంటే.. మరి పూర్తి సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో ఆడుకుంటారో. పాపం తమన్.

Advertisement
Exit mobile version