Nayanathara -Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె నటించిన తాజా చిత్రం కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకి నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు.
విగ్నేష్ శివన్ చేతిలో చేయి వేసుకుని చాలా క్లోజ్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తిగత ఫోటో బయటకు లీక్ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఇది వరకే వీరిద్దరికీ సంబంధించిన ఇలాంటి వ్యక్తిగత ఫోటోలు ఎన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ప్రస్తుతం ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ వీరు పెళ్లి గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
