G
Telugu News » Entertainment » mahesh babu mahesh babu emotional post on ramesh babu death during funerals
⚡ Entertainment, Latest, Topstory, Trending

Mahesh Babu : హీరో మహేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.. అన్నయ్యా.. నాకు అన్నీ నువ్వే..!

Mahesh Babu : టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, ప్రిన్స్‌ మహేష్ బాబు సోదరుడు నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు (56) మృతితో తెలుగు స

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Mahesh Babu : టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, ప్రిన్స్‌ మహేష్ బాబు సోదరుడు నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు (56) మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. గతకొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న రమేశ్ బాబు శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఆదివారం జూబ్లీ హిల్స్‏లోని మహాప్రస్థానంలో రమేశ్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. రమేశ్ అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తుది వీడ్కోలు పలికారు. రమేష్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. రమేశ్ ఆత్మకు శాంతి చేకూరాలని తమ ప్రగాఢ సానూభూతిని తెలియజేస్తున్నారు.

Advertisement

సోదరుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల కరోనా బారినపడ్డారు. ఈ పరిస్థితుల్లో అన్నయ్య రమేశ్ బాబు ఆఖరి చూపుకు నోచులేకపోయానంటూ మహేశ్ సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. రమేశ్ బాబు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీలుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రమేశ్ మృతితో మహేశ్ తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. ప్రస్తుతం హోంఐసోలేషన్‌లో ఉన్న మహేష్‌ను నమ్రత ఓదార్చుతూ ధైర్యం చెబుతున్నారు.

అన్నయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని మహేశ్ బాబు గుర్తు చేసుకుంటూ కన్నీంటిపర్యంతమయ్యారు. సోషల్ మీడియాలో మహేశ్ బాబు ఎమోషనల్ పోస్టు పెట్టారు. ‘మీరే నాకు ఆదర్శం. నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం. నువ్వు లేకుండా ఉంటే.. ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు. నాకోసం మీరు ఎంతో చేశారు. ఒకవేళ నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్యగా రావాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను. ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ మహేశ్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

 

Advertisement

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

Read Also : Ramesh Babu : హీరో మహేష్ సోదరుడు రమేష్ బాబు కన్నుమూత

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Mahesh BabuMahesh babu CoronaRamesh Babu DeathRamesh Babu FuneralsSuper Star Krishna
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు