Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Liger Movie First Reivew : లైగర్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందిగా.. పూరీ మార్క్, విజయ్ యాక్షన్.. పైసా వసూల్ మూవీ!

Liger Movie First Reivew : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న మూవీ లైగర్ (Liger Movie Review) రిలీజ్‌కు ముందే ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. లైగర్ టీమ్ ఎక్కడికి వెళ్లినా ప్రమోషన్స్‌లో ఆడియెన్స్ రియాక్షన్ అదిరిపోతోంది. లైగర్ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కేక పుట్టించింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో విజయ్ క్రేజ్ మామూలుగా లేదు. హీరోయిన్ అనన్య పాండే క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. పూరీ కనెక్ట్‌తో కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ మూవీని పాన్ ఇండియాగా తెరకెక్కించారు.

Liger Movie First Review _ Vijay Devarakonda Starrer Liger Movie Reviewed By umair sandhu

ఇప్పటివరకూ రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తూనే హీరో బాక్సింగ్ నేపథ్యంలో రాబోతుందని తెలుస్తుంది. శివగామి రమ్యకృష్ణ హీరో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. వాస్తవానికి ఈ లైగర్ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. అనుకోని కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లైగర్ మూవీ ప్రమోషన్లతోనే సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే దక్షిణాది, ఉత్తరాది మొత్తం తిరుగుతూ తెగ ప్రమోషన్ చేసేశారు. దాంతో లైగర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే రెండు రోజుల్లో లైగర్ మూవీ రిలీజ్ ఉండగా.. ఫస్ట్ రివ్యూ ముందుగానే వచ్చేసింది. సోషల్ మీడియాలో ఈ మూవీ రివ్యూ పోస్ట్‌ను విడుదల చేశారు. ఎన్నో సినిమాలకు రివ్యూ ఇచ్చిన ఉమైర్ సందు లైగర్ మూవీకి కూడా రివ్యూ ఇచ్చేశారు. లైగర్ ఒక పైసా వసూల్ మాస్ ఎంటర్టైన్మెంట్ అంటూ రివ్యూ ఇచ్చారు. విజయ్ దేవరకొండ తన నటనతో విశ్వరూపం చూపించాడని అన్నాడు.

Advertisement
Liger Movie First Review _ Vijay Devarakonda Starrer Liger Movie Reviewed By umair sandhu

ఉమైర్ సందు చాలా తెలుగు సినిమాలకు రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. చాలావరకూ ఆయన ఇచ్చిన రివ్యూలకు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఉమైర్ సందు రివ్యూ చూసిన తర్వాత మూవీ రిజల్ట్ మరోలా ఉన్నాయి. తెలుగు మాత్రమే కాదు.. బాలీవుడ్ మూవీలకు కూడా ఉమైర్ సందు రివ్యూలు ఇచ్చారు. అందులో లాల్ సింగ్ చద్దా మూవీ ఒకటి.. దీనికి సందు అద్భుతం అంటూ రివ్యూ ఇచ్చారు కానీ, ఉమైర్ సందు రివ్యూలా మూవీ ఆడలేదంటూ పలువురు కామెంట్లు చేశారు.

ఈ మూవీకి ఉమైర్ సందు ఇచ్చిన రివ్యూ ఎంతవరకు సరిపోలుతుందో చూడాలి. లైగర్ సినిమా సెన్సార్ పూర్తి కాలేదు. సెన్సార్ లో కొన్ని పదాలను తొలగించాలని, ఆ పదాలకు బదలుగా మరో పదాలు పెట్టాలని సెన్సార్ బోర్డు సూచించినట్టు తెలిసింది. ఏది ఏమైనా పూరీ మార్క్, విజయ్ విశ్వరూపం చూడాలంటే.. ఆగస్టు 25న రిలీజ్ కానున్న లైగర్ మూవీని థియేటర్లలోకి వెళ్లి చూడాల్సిందే. విజయ్ దేవరకొండ లైగర్ బాయ్‌గా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.

Liger Movie First Reivew : లైగర్ సినిమా అసలు స్టోరీ ఇదే..?

Liger Movie First Review _ Vijay Devarakonda Starrer Liger Movie Reviewed By umair sandhu

లైగర్ (విజయ్ దేవరకొండ) తల్లి (రమ్యకృష్ణ) తో ముంబైకి వస్తాడు. లైగర్ చిన్నప్పటి నుంచి మైక్ టైస‌న్ ఫ్యాన్. టైస‌న్‌తో సెల్ఫీ దిగాలనేది`లైగ‌ర్‌` డ్రీమ్. లైగర్ చివ‌రికి క్లైమాక్స్‌లో టైస‌న్‌ ట్రైనింగ్‌లోనే పెద్ద బాక్సర్ అవుతాడు. లైగర్ క‌ల‌ని నిజం చేసుకుంటాడా? తల్లిగా రమ్యకృష్ణ పాత్ర ఏమిటి ? అనన్య పాండేతో ‘లైగర్’ లవ్ ట్రాక్? ఎలా మొదలైందనేది తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే. లైగర్ గురించి చెప్పాలంటే.. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే మూవీ. అయితే ఈ మూవీలో ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి. హీరో విజయ్ దేవరకొండతో ఎమోషన్స్ బాగా వచ్చాయి.

Advertisement

సెకండాఫ్‌లో వచ్చే బాక్సింగ్ సీన్స్ సూపర్.. అనన్యతో రొమాంటిక్ సీన్స్ మెయిన్ హైలైట్స్ అని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పూరీ బాగా ఎలివేట్ చేశాడు. విజయ్ దేవరకొండ తనదైన నటనతో రెచ్చిపోయాడు. పూరీ, విజయ్ కాంబినేషన్ అదుర్స్. మాస్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే మూవీ. కొన్ని సీన్స్ లో అసలు లాజిక్ కనిపించదు. ఆ సీన్స్ చాలా బోర్ ఫీలింగ్ తెప్పించేలా ఉన్నాయి. మూవీలో నిర్మాణ విలువలు బాగున్నా.. స్క్రీన్‌ప్లే అంతగా ఆసక్తిగా లేదని చెప్పాలి. మొత్తం మీద ఫ్యామిలీతో కలిసి వెళ్లే సినిమా కాదు.. ఎందుకంటే ఇందులో బూతులకు కొదవ లేదు. అదే మాస్ ఆడియెన్స్ అయితే తెగ ఎంజాయ్ చేయొచ్చు.

Read Also : Liger Movie Trailer Review : లైగర్ ట్రైలర్ ఆగయా.. విజయ్ చించేసాడుపో.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే.. వీడియో!

Advertisement
Exit mobile version