Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Krithi shetty: లైవ్ లోనే ఏడ్చేసిన కృతిశెట్టి.. వారిపై నెటిజన్ల ఫైర్

Krithi shetty: చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ప్రారంభంలోనే మంచి మంచి ఆఫర్లు రాగా… వాటిని ఒడిసిపట్టుకుని విజయాలు సాధించింది. మొదటి సినిమా ఉప్పెనతోనే మంచి గుర్తింపు సాధించింది. తర్వాత శ్యామ్ సింగరాయ్ తో అందర్నీ ఆకట్టుకుంది. తర్వాత బంగార్రాజు సినిమాలో విమర్శకులను సైతం మెప్పించింది. మూడు సినిమాలు వరుస హిట్ లు అందుకుంది కృతి శెట్టి. కానీ ఎక్కడా పొగరు చూపించదు. సినిమా ప్రమోషన్ లో అయినా బయట వేరే ఫంక్షన్ అయినా పద్ధతి అయిన డ్రెస్ లోనే కనిపిస్తుంది. సినిమాల్లో ఎలా నటించినా.. బయట మాత్రం ఏ మాత్రం ఎక్స్ పోజ్ అయ్యే డ్రెస్సులు వేసుకోదు. ప్రస్తుతం సుధీర్ బాబు, నితిన్, రామ్, తమిళ్ సూర్యతో సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉంది కృతి.

ఇటీవల ఓ తమిళ అవార్డు ఫంక్షన్ లో పాల్గొంది కృతి. ఈ కార్యక్రమానికి చెందిన ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో కృతిని తమిళ ప్రాంక్ యూట్యూబర్లు ఆశిక్, సారథిరన్ కృతి శెట్టిని ఇంటర్వూ చేశారు. ఇంటర్వ్యూ జరుగుతుండగానే వారిద్దరు ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. కృతిని నేను ప్రశ్నలు అడుగాతానంటే నేను అంటూ కొట్టుకునేంత పని చేశారు. దీంతో కృతి కొంత భయాందోళనకు గురైంది. ఇదంతా ప్రాంక్ అని చెప్పే ప్రయత్నం చేయగా కృతి దుఃఖం ఆపుకోలేక లైవ్ లోనే ఏడ్చేసింది.

Advertisement

కృతి శెట్టిని ఇలా భయాందోళనకు గురి చేసిన ప్రాంక్ యూట్యాబర్లపై నెటిజన్లు మండి పడుతున్నారు. ఏడ్చే వరకు ప్రాంక్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Krithi shetty: తన్ లవ్ గురించి స్పందించిన కృతి.. దృష్టంతా అక్కడే అంటూ కామెంట్లు!

Advertisement
Exit mobile version