Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Keerthi suresh : మహేష్ బాబు గురించి కీర్తి సురేష్ ఎమోషనల్ పోస్ట్.. అందులో ఏముందంటే?

Keerthi suresh : కీర్తి సురేష్ కు ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వచ్చిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ ఖాతాలో కూడా ఓ హిట్ పడినట్లు అయింది. అయితే సర్కారు వారి పాట మే 12వ తేదీన విడుదల కాగా… బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. అయితే వీటిన్నిటిపై స్పందిస్తూ… కీర్తి సురేష్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Keerthi suresh

కీర్తి సురేష్ నటించిన సాని కాయిదం అనే సినిమాతో పాటు సర్కారు వారి పాట చిత్రాలు పెద్ద విజయాలు అందుకున్నాయి. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా రెండు సినిమాలు చేసిన టీంకు ధన్యవాదాలు తెలిపింది. “ప్రియమైన వారందరికీ నా మాట ఇది. నటిగా ఉండటం అనేది హానికర ఎగుడుదిగుడు ప్రయాణం లాంటిది. మనం ఎత్తులు పల్లాలు చూస్తాం. కానీ ఈ ప్రయాణం తరచుగా మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇటీవలి గతం నాకు పరీక్షా సమయం లాంటిది. ఇది ఒక దశ. ప్రపంచానికి నా అత్యుత్తమ ప్రదర్శనను అందించడానికి నేను నిరంతర కృషి చేయాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది” ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

Exit mobile version