Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Kajal agarwal : నా బాబు ఛాతిపై పడుకున్న క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటున్న కాజల్..!

Kajal agarwal : చందమామ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఆమె మాత్ృత్వపు మధురానుభూతులను ఆస్వాదిస్తోంది. ఆమె గర్భం దాల్చిన నాటి నుంచి అందుకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. బేబీ బంప్ ఫొటోస్ తో పాటు సీమంతం ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు. అయితే తాజాగా ఆమె ఏప్రిల్ 19 మంగళవారం రోజు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇందుకు సంబంధించి తాజాగా ఆమె ఓ పోస్టు చేశారు.

Kajal agarwal

నా బిడ్డ నీల్ ను ప్రపంచంలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని.. ఎంతో సంతోషిస్తున్నాని తెలిపింది. నీల్ మొదటి సారి నా ఛాతిపై పడుకున్న క్షణాన్ని జీవితాంతం మర్చిపోలేనని వివరించింది. ఆ ఒక్క క్షణం తాను ప్రేమకు సంబంధించి లోతైన భావన పొందానని కాజల్ తెలిపింది. జీవితాంతం తాను చేయాల్సిన బాధ్యతను గుర్తు చేసుకున్నట్లు వివరించారు. అయితే బిడ్డకు జన్మనిచ్చాక ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు కానీ కచ్చితంగా అందంగా ఉంటారంటూ తన మాత్ృత్వపు ముధురానుభూతుల్ని పంచుకుంది కాజల్.

Read Also Kajal agarwal baby boy: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్..!:

Advertisement
Exit mobile version