Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Jai Balaiah-Bunny : ‘జై బాలయ్య’ ఎఫెక్ట్.. బన్నీని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్

Jai Balaiah-Bunny Mega Fans Trolls on Allu Arjun with Jai Balaiah Effect   

Jai Balaiah-Bunny Mega Fans Trolls on Allu Arjun with Jai Balaiah Effect   

Jai Balaiah-Bunny : తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన ఎంతో కష్టపడి సెట్ చేసిన ట్రాక్ పై తమ్ముడు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెగాఫ్యామిలీ నుంచి కుర్రహీరోలు, నాగబాబు కూతురు నిహారిక కూడా వెండి తెరపై సందడి చేశారు. అయితే, మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్నది అల్లు అర్జున్ అండ్ రాంచరణ్ తేజ్.. అయితే, ఈ మధ్య కాలంలో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అందుకు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి.

చిరు బామ్మర్ది అల్లు అరవింద్ ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు. మొన్నిమధ్య ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫాం కోసం నందమూరి బాలయ్యతో ‘అన్‌స్టాపబుల్’ పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేశారు. దీనికోసం హోస్ట్ గా బాలకృష్ణను సంప్రదించడం అందుకు ఆయన ఓకే చెప్పడం చకాచకా జరిగిపోయాయి. ఇప్పటికే ఈ ప్రోగ్రాం రెండు ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. నిన్న ‘అఖండ’ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు బన్నీ హాజరయ్యారు. బాలయ్య గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు.

ఆయన ఫ్యాన్స్ అడిగారని ‘జై బాలయ్య’ అని కూడా అన్నారు.అయితే, గతంలో ఓ మూవీ ఫంక్షన్‌‌కు వచ్చిన అల్లు అర్జున్ పవన్ ఫ్యాన్స్ చేస్తున్న గోలకు కొంత అసహనానికి గురైన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గురించి అభిమానులు అరుస్తుండగా ‘చెప్పను బ్రదర్’ అంటూ గట్టిగా అనడంతో అప్పుడు మెగా ఫ్యాన్స్ బన్నీని ఘోరంగా ట్రోల్ చేశారు. ప్రస్తుతం బాలయ్య ఫంక్షన్‌లో బన్నీ  ‘జై బాలయ్య’ అనడంపై విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి.

Advertisement

సొంత ఇమేజ్ కోసం మరి ఇంత దిగజారాలా అంటూ మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ప్రవర్తనలో వచ్చిన మార్పులను చూసి నిజంగానే చిరు ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చిందని అందుకే వీరు మెగా ఫ్యామిలీని కాదని నందమూరి ఫ్యామిలీకి చేరువ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.

Read Also : TDP-Janasena : టీడీపీ, జనసేన ఒక్కటయ్యేనా…? దీని వల్ల లాభం ఎవరికి..?

Advertisement
Exit mobile version