Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Jabardasth Promo : వాడు నిన్నేం చేస్తాడులే.. అయ్యో.. అజర్ పరువు తీసిందిగా రీతూ.. వీడియో..!

Jabardasth Promo : Ritu Chowdhary Couter to azar in jabardasth Comdedy Show

Jabardasth Promo : Ritu Chowdhary Couter to azar in jabardasth Comdedy Show

Jabardasth Promo : టీవీ షోల్లో పాపులర్ కామెడీ టీ షో ఏది అంటే.. టక్కున గుర్తొచ్చేది జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show) . ఈ కామెడీ షొలో కామెడీ టైమింగ్ , స్కిట్టులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయి. ఈ మధ్యన జబర్దస్త్ కామెడీ షో ప్రేమ జంటలతోనే స్కిట్ కానిస్తున్నట్టు కనిపిస్తోంది. సుడిగాలి సుధీర్ రష్మీ కెమెస్ట్రీ నడిచింది.. ఇటీవలే ఇమాన్యుయేల్ వర్ష జోడీ అదరగొట్టేసింది.

అటువైపు రాకింగ్ రాకేష్ సుజాత జంట ఫుల్ ఫేమస్ అయ్యాయి. రోహిణితో ట్రాక్ నడిపిన రాకేశ్ సుజాతను ట్రాక్ లో పెట్టేశాడు. రాకేష్ సుజాత ట్రాక్ నడుస్తోంది. జబర్దస్త్ జోడీల్లో మరో కొత్త జంట ఎంట్రీ ఇచ్చింది. ఆ జంట ఎవరో కాదు.. అజర్, రీతూ జంట.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా తెగ డ్రామా చేస్తున్నారు. హగ్గుల మీద హగ్గులతో రెచ్చిపోతున్నారు. రీతూ పర్ఫామెన్స్ అదరగొట్టేసింది.

Jabardasth Promo : Ritu Chowdhary Couter to azar in jabardasth Comdedy Show

అజర్ ను పట్టుకుని బోరుమని ఏడ్చేసింది కూడా. హైపర్ ఆది జబర్దస్త్ షోకు రావడం లేదు. ఇప్పుడా ఆ టీంను అజర్ చేతికి పగ్గాలు అందించింది మల్లెమాల.. ఇప్పుడే అజరే టీం లీడర్‌గా నడిపిస్తున్నాడు. ఆది తరహాలో అజర్ స్కిట్ వర్కౌట్ కావడం లేదు. అజర్ ఏం చేయాలో తెలియని పరిస్థితి. లేటెస్టుగా జబర్దస్త్ కామెడీ షో నుంచి కొత్త ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో రీతూ డైలాగ్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆ స్కిట్‌లో నన్నేం చేయకు అంటూ ఓ అమ్మాయి అజర్‌ని చూసి భయపడిపోతుంటుంది.

Advertisement
Jabardasth Promo _ Ritu Chowdhary Couter to azar in jabardasth Comdedy Show

సడెన్ ఎంట్రీ ఇచ్చిన రీతూ దిమ్మతిరిగే కౌంటర్ వేసింది. జేజేమ్మ అంటూ ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి.. నన్నేం చేయలేవు అనగానే.. రీతూ డైలాగ్ అందుకుంటుంది. ఇంత పెద్ద స్కిట్టే ఇస్తేనే వాడు ఏం చేయలేకపోతోన్నాడు… ఇక వాడు నిన్నేం చేస్తాడులే అని రీతూ గట్టిగానే ఇచ్చిపడేసింది. అంతే.. జడ్జెస్ సహా అక్కడి వారంతా ఆగకుండా నవ్వుతూనే ఉండిపోయారు. అంతలోనే రీతూ మీద రివర్స్ కౌంటర్ పడింది. రీతూ వెంటనే నోరెళ్ల పెట్టేసింది.

Read Also : Viral video: డ్యాన్స్ తో దుమ్మురేపిన అమ్మాయి.. ఎంత క్యూట్ గా చేసిందో మీరూ చూసేయండి!

Advertisement
Exit mobile version