Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rakul Preet: ఈర్ష్యతో రగిలిపోతే సమయం వృధా చేసుకోవడమే… సాధించేది ఏమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రకుల్!

Rakul Preet: కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఇలా ఈ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించిన రకుల్ ప్రీత్ సింగ్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సాధారణంగా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య పెద్దఎత్తున పోటీతత్వం ఉండటం సర్వసాధారణం. ఇలా ఎంతోమంది నటీనటులు పోటీలు పడుతూ ఉంటారనే విషయం తెలిసిందే. ఇక ఈ విషయం గురించి రకుల్ ప్రీత్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్ చేశారు.

వృత్తి పరంగా తోటి నటీమణులతో నాకు ఎలాంటి అభద్రతా భావం లేదు. కేవలం ట్యాలెంట్‌ ఆధారంగానే నాకు అవకాశాలు వస్తున్నాయి. కొందరు ఎంతో అద్భుతమైన టాలెంట్ ద్వారా సినిమా అవకాశాలను దక్కించుకుంటారు. బాలీవుడ్ నటి కృతిసనన్ మిమి సినిమా, అలియా భట్ గంగు బాయ్ సినిమా నాకు ఎంతగానో నచ్చాయని ఈ సినిమాలు తనని బాగా ఆకట్టుకుంటాయని ఈ సందర్భంగా రకుల్ వెల్లడించారు. ఇలా ఒకరిపై ఈర్ష్యతో రగిలిపోతే వచ్చేది ఏమీ లేదు కేవలం సమయం వృధా చేసుకోవడమే అంటూ ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement
Exit mobile version