Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Indian Idol Telugu Episode : ఆహా అంటున్నారా.. తెలుగు ఇండియన్ ఐడల్‌‌కి వచ్చిన రెస్పాన్స్ ఇది..!

indian-idol-telugu-episode-aha-ott-telugu-indian-idol-responce

indian-idol-telugu-episode-aha-ott-telugu-indian-idol-responce

Indian Idol Telugu Episode : ఇన్నాళ్లు సింగింగ్‌ షో లు కేవలం బుల్లి తెర పై మాత్రమే ప్రసారమయ్యేవి. ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ, జీ తెలుగు ఛానళ్లలో మాత్రమే సింగింగ్ కార్యక్రమాలు ప్రసారం అయ్యాయి. కానీ మొదటి సారి తెలుగు ప్రేక్షకుల ముందుకు సింగింగ్ షో డిజిటల్ వేదిక ద్వారా వచ్చింది. ఆహా ఓటీటీ (Aha OTT Telugu) వారు తీసుకు వచ్చిన ఈ సింగింగ్ కాంపిటీషన్ కు మొదటి నుండి భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి.

ఎందుకంటే ఈ సింగింగ్ కాంపిటీషన్ కు మాజీ ఇండియన్ ఐడల్ అయిన శ్రీ రామచంద్ర యాంకర్ గా వ్యవహరించడం తో పాటు ఈ సింగింగ్ కార్యక్రమానికి ఇండియన్ ఐడల్ తెలుగు అంటూ టైటిల్ని నిర్ణయించడం ద్వారా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే మంచి బ్రాండ్ ఉన్న ఇండియన్ ఐడల్ ను తెలుగు లోకి తీసుకు రావడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించవచ్చు అని భావించారు.

Indian Idol Telugu Episode : ఆహా ఓటీటీ వేదికగా సింగింగ్ కాంపిటీషన్..

indian-idol-telugu-episode-aha-ott-telugu-indian-idol-responce 

కానీ డిజిటల్ వేదిక అవ్వడం వల్ల ఈ సింగింగ్‌ కాంపిటీషన్ ను అత్యధిక జనాలు పెద్ద చూడడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సింగిల్ కాంపిటీషన్ ను ఎక్కువగా పెద్ద వారు చూస్తారు అనే టాక్ ఉంది. పెద్ద వారు ఓటీటీ కి వచ్చి చూస్తారని నమ్మకం లేదు. అందుకే ఈ షో కి ఆశించిన స్థాయిలో వ్యూవర్షిప్ రావడం లేదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆహా వారు మాత్రం ఆహా అనేట్లుగా రేటింగ్ వస్తుంది మంచి వ్యూవర్ షిప్ తో మా షో దూసుకు పోతుంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి.

Advertisement

Read Also : Kacha Badam Telugu Version : కచ్చా బాదమ్ తెలుగు వెర్షన్ ‘పల్లీ పల్లీ.. ఇది పచ్చీ పల్లి’.. అచ్చ తెలుగులో దుమ్ములేపుతుందిగా.. వీడియో!

Exit mobile version