G
Telugu News » Entertainment » do you know these things about social media sensation niharika
⚡ Entertainment, Latest

Niharika: టాలీవుడ్ టూ బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలతో రీల్స్ చేయిస్తున్న నిహారిక ఎన్ ఎమ్!

Niharika: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ రోజుల్లో యువత ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు సెల్ ఫోన్ లో మునిగిపోయి ఉంటారు

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Niharika: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ రోజుల్లో యువత ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు సెల్ ఫోన్ లో మునిగిపోయి ఉంటారు. యూట్యూబ్, టిక్ టాక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్స్ లో నిత్యం ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఇలా నిత్యం సోషల్ మీడియాలో యక్టివ్ గా ఉండే వారిలో కొందరు చాలా ఫేమస్ అవుతారు. అటువంటి వారిలో నీహారిక ఎన్ ఎమ్ కూడా ఒకరు. చెన్నైలో పుట్టిన నిహారిక ప్రస్తుతం లాస్ఏంజిల్స్ లో ఎంబీఏ చదువుతోంది.

కరోనా లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన నిహారిక ఆ సమయంలో కాలక్షేపం కోసం యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ చేయటం మొదలు పెట్టింది. తర్వాత ఫన్నీ వీడియోస్ చేస్తూ బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా అని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ ని అనుకరిస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ తో స్టార్ హీరోలను సమర్థవంతంగా వాడుకోవడంలో నిహారిక ఆరితేరింది. ఈ సందర్భంగా పాన్ ఇండియా హీరో యష్ తో డిజిటల్‌ కంటెంట్‌ క్రియేట్‌ చేసిన 24 గంటల్లోనే ఇన్‌స్టా రీల్‌లో మూడున్నర మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. బాలీవుడ్ హీరో షాహిద్‌ కపూర్‌తో చేసిన రీల్‌ కూడా మిలియన్‌ వ్యూస్‌కు చేరువలో ఉంది.

ప్రస్తుత నీహారిక కు ఇన్‌స్టాలో 2.1 మిలియన్స్‌ ఫాలోవర్స్‌, యూట్యూబ్‌లో 849కే సబ్‌స్ర్కైబర్స్‌ ఉన్నారు. “తక్కువగా ఆలోచించండి ఎక్కువగా మాట్లాడండి” అనే సూత్రంతో నిహారిక ముందుకు సాగిపోతోంది. నిహారిక సోషల్ మీడియా వేదికగా సామాజిక సమస్యలను గురించి ప్రస్తావిస్తూ ప్రజలకు చైతన్యం కలిగిస్తుంది. తెలుగు, తమిళ,కన్నడ వంటి పలు భాషలలో నీహారిక వీడియోలు చేస్తోంది. అందువల్ల అన్ని భాషల వారు ఆమెకు ఫోల్లోవర్లుగా మారుతున్నారు. సోషల్ మీడియాలో ఇంతటి ఫాలోయింగ్ ఉన్న నిహారిక ” క్రియేటర్స్‌ ఫర్‌ చేంజ్‌ ” ‘యూట్యూబ్‌ ఇనీషియేటివ్‌’ వంటి అవార్డులకు ఎంపికైన ఏకైక భారతీయురాలిగా గుర్తింపు పొందింది.

Advertisement

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷inspirationInstagramNiharikaniharika nm
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు