Shiva jyothi : వీ6లో ‘తీన్మార్’, ‘టీవీ9’ లో ‘ఇస్మార్ట్ న్యూస్’ వంటి షోలతో బాగా పాపులర్ అయ్యింది శివ జ్యోతి. ఈమె అసలు పేరు శివ జ్యోతి అయినప్పటికీ సావిత్రక్కగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న శివజ్యోతి తనకు ఉన్న పాపులారిటీతో బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకున్నారు.ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా టాప్ సిక్స్ లో ఉన్న శివ జ్యోతి ఈ కార్యక్రమంతో బాగా ఫేమస్ అయ్యారు.
ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం శివజ్యోతి తన భర్తతో కలిసి పచ్చి మామిడి పళ్ళు తింటూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది శివజ్యోతి ప్రెగ్నెంట్ అంటూ పెద్దఎత్తున వార్తలను సృష్టించారు.ఇలా తన ప్రెగ్నెన్సీ గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై శివజ్యోతి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ అనేది మా జీవితంలో చాలా పెద్ద విషయం ఎన్నో రోజుల నుంచి మా కుటుంబ సభ్యులు ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు.
ఇలా ఎంతో ఎమోషనల్ గా ఉన్నటువంటి ఈ విషయాన్ని చాలా మంది వారి స్వార్థం కోసం, వారి ఛానల్ వ్యూస్ కోసం తప్పుగా ప్రచారం చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి ఏదైనా అలాంటి శుభవార్త ఉంటే తప్పకుండా నేనే అందరికీ చెబుతాను అంతేకాని ఇలా తప్పుడు వార్తలు రాయకండి అంటూ తన ప్రెగ్నెన్సీ గురించి శివ జ్యోతి క్లారిటీ ఇచ్చారు.
- Chiranjeevi: శుభ గృహ యాడ్ కోసం చిరంజీవి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Keerthy Suresh: మహేష్ బాబు కోసం ఎదురుచూస్తున్న కీర్తి సురేష్.. డబ్బింగ్ పూర్తి చేసుకున్న మహానటి!
- Sreekanth Reddy: డబ్బుకోసమే కరాటే కళ్యాణి నా పై దాడి చేసింది.. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!
