Deepti Sunaina: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లో వాడకం పెరగటం వల్ల చాలామంది తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి సోషల్ మీడియాని ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకుంటూ సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి జంటగా సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ చేయటం వల్ల బాగా పాపులర్ అయ్యారు.
అప్పటినుండి వీరిద్దరూ వేరువేరుగా వారి పనులతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫొటోస్ తో పాటు డాన్స్ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. తాజాగా విరాటపర్వం సినిమాలోని ‘ఎవరిని ఎవరు ప్రేమించరు. మనల్ని మనం ప్రేమించుకోవడం నిజం. ఇంకా చెప్పాలంటే ప్రేమ అనేది పెద్ద అబద్ధం” అనే డైలాగ్ ఉన్న వీడియో షేర్ చేసింది. దీంతో షణ్ముఖ్ ని ఉద్దేశించే దీప్తి సునైనా ఈ వీడియో షేర్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీప్తి ఈ విధంగా ప్రేమ పై తనకి ఉన్న అభిప్రాయాన్ని తెలియచేసింది.
