Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Chinmayi: సమంతతో చిన్మయి ప్రయాణం ముగిసిందట.. ఇక డబ్బింగ్ చెప్పదా!

Chinmayi: ఏమాయ చేశావే సినిమాతో సమంత తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తన మొదటి చిత్రంలో ఆమె పోషించిన జెస్సీ పాత్ర అందరికీ గుర్తుండిపోవడానికి ముఖ్య కారణం ఆమె వాయిస్. అయితే స్క్రీన్ పై సామ్ కనిపించినా ఆ వాయిస్ మాత్రం చిన్మయి శ్రీపాదదే. ఆ తర్వాత సామ్ చేసిన ఎన్నో సినిమాలకు ఈమె డబ్బింగ్ చెప్పారు. ఎంతో పేరు తెచ్చుకున్నారు. Advertisement అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ... Read more

By Vinod Kumar

Published on: September 4, 2022 8:00 AM

Updated on: September 3, 2022 11:45 PM

---Advertisement---

Chinmayi: ఏమాయ చేశావే సినిమాతో సమంత తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తన మొదటి చిత్రంలో ఆమె పోషించిన జెస్సీ పాత్ర అందరికీ గుర్తుండిపోవడానికి ముఖ్య కారణం ఆమె వాయిస్. అయితే స్క్రీన్ పై సామ్ కనిపించినా ఆ వాయిస్ మాత్రం చిన్మయి శ్రీపాదదే. ఆ తర్వాత సామ్ చేసిన ఎన్నో సినిమాలకు ఈమె డబ్బింగ్ చెప్పారు. ఎంతో పేరు తెచ్చుకున్నారు.

Advertisement

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి శ్రీపాద.. ఇక సామ్ తో తన ప్రయాణం ముగిసిందని చెప్పింది. అది కేవలం కెరియర్ పరంగా మాత్రమేనని కూడా వివరించింది. అయితే తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకు గుర్తింపు వచ్చిందంటే అది కేవలం సమంత వల్లేనని.. ప్రస్తుతం తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటుందని చిన్మయి చెప్పుకొచ్చింది.

సామ్ పాత్రలకు ఆమే డబ్బింగ్ చెప్పుకోవడం తనకు సంతోషాన్ని ఇస్తుందని కూడా వివరించింది. అయితే కెరియర్ పరంగా తమ ప్రయాణం ముగిసినప్పటికీ.. స్నేహితులుగా జీవితాంతం కలిసుంటామంది. తన భర్త రాహుల్, సామ్ మంచి స్నేహితులని.. వీలయినప్పుడల్లా తాము ఇంట్లోనే కలుసుకుంటామని వివవించింది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.