Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigboss 5 Telugu : ‘సిరి’ ఔట్.. హగ్ ఇచ్చి కన్నీటి వీడ్కోలు పలికి ఎక్కెక్కి ఏడ్చేసిన షణ్ముక్.. !

siri-hanmanth-eliminated-fr

siri-hanmanth-eliminated

Bigboss 5 Telugu : బిగ్ బాస్ సీజన్-5 ఎంటర్ టైన్మెంట్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే 14 వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో నుంచి ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ప్రస్తుతం టాప్ -5లో సిరి, షణ్ముక్, మానస్, శ్రీరామచంద్ర, షణ్ముక్ ఉన్నారు. చివరి వారం కావడంతో ఈ ఆదివారం విన్నర్‌ను బిగ్‌బాస్ ప్రకటించనున్నాడు. మిగతా సభ్యుల్లో ఎవరో ఒకరు రన్నరప్‌గా నిలుస్తారు. మిగతా సభ్యులు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. అయితే, శుక్రవారం రాత్రి ఈ ఎలిమినేషన్‌కు సంబంధించి వీడియో ప్రసారం కానుంది.

14 వారాల పాటు విజయవంతంగా బిగ్‌బాస్ హౌస్‌లో  కొనసాగిన సభ్యులు వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. 15 వారంతో బిగ్ బాస్ షోకు ఎండ్ కార్డ్ పడనుండటంతో ఎవరు టైటిల్ గెలుస్తారని అంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.అయితే, అందరూ అనుకున్నట్టు గానే బిగ్‌బాస్ ఈసారి ‘సిరి హన్మంతు’ను హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. దానికి సంబంధించి ఈరోజు రాత్రి హైలెట్స్‌ను చూడొచ్చు. ఈ విషయాన్ని బిగ్ బాస్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

Bigg Boss 5 Telugu

ఇన్ని రోజులు తన అందంతో అభినయంతో పాటు షణ్ముక్ తో హగ్గులు, ముద్దులు, ఒకే మంచం మీద జంట పాముల వేల కరుసుకుని పడుకున్న షణ్ముక్ సిరి ఆడియెన్స్‌కు ఓ రేంజ్ సినిమా చూపించారు. సిరి, షణ్ముక్ హగ్ లేకుండా దాదాపు ఈ సీజన్ లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారిగా బిగ్ బాస్ సిరిని బయటకు పంపించడంతో సిరిమ్మా బాగా ఎమోషనల్ అయ్యింది.తన ప్రియమైన షన్నూకు వెళ్లేటప్పుడు కూడా హగ్ ఇచ్చి వెళ్లింది. షణ్ముక్ కూడా తనను ఓదార్చి పంపించాడు.

Advertisement
Bigg Boss 5 Telugu

ఇంకా మూడు రోజుల్లో సీజన్ -5 ముగుస్తుండగా.. సిరి లేని బిగ్‌బాస్‌ను ఊహించుకోవడం కష్టమని కొందరు అంటుంటే.. సిరి లేకుండా షణ్ముక్ ఈ మూడు రోజులు నిద్రపోతాడా? ఒకే మంచంపై హగ్ చేసుకుని పడుకున్నారు? అసలు షణ్ముక్ పరిస్థితి ఎంటని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో మానస్, శ్రీరామచంద్ర, సన్నీ, షణ్ముక్ మాత్రమే మిగిలారు. వీరిలో టైటిల్ విజేత ఎవరో అని బిగ్ బాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Read Also : Pushpa Movie Review : తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ ఎలా ఉందంటే..?

Advertisement
Exit mobile version