Anchor Vishnu Priya: పోవే పోరా షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన యాంకర్ విష్ణుప్రియ అందరికీ ఎంతో సుపరిచితమే. ఈ కార్యక్రమం ద్వారా సుధీర్ తో కలిసి ఈమె చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఈ విధంగా మొదటి షో తోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ అనంతరం పలు షోల ద్వారా ప్రేక్షకులను సందడి చేసింది. ఇక విష్ణుప్రియ బుల్లి తెర పైకి రాక ముందే టీనేజ్లోనే వెండితెరపై ఓ సినిమాలో తలుక్కుమంది. ఈ విధంగా బుల్లితెర వెండితెర పై ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయి.
ఈ వీడియోలో భాగంగా విష్ణు ప్రియ టాప్ పైకి లేపి తన నడుము, నాభి అందాలను ఆరబోస్తూ డాన్స్ చేసిన వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ సండే ఆల్వేస్ ఫన్ డే అంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ డాన్స్ వీడియో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు సో హాట్ అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు పండగపూట ఇలాంటి డాన్సులు ఏంటి అంటూ తనదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
- Facebook Meta Users Loss : చరిత్రలో ఫస్ట్ టైమ్ చెత్త రికార్డు నమోదు చేసిన ఫేస్బుక్… ఒక్క రోజులోనే లక్షన్నర కోట్లు లాస్
- Viral News: బాహుబలి వెడ్డింగ్ కార్డ్.. పెళ్లి పత్రికలో ఏకంగా 900 కుటుంబాల పేర్లు.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
- Viral Video: ముసుగు వేసి మొసలితో పరచకాలు.. ఆ మొసలి చేసిన పని చూస్తే షాక్..!
