Anchor lasya: యాంకర్ లాస్యకు ఏమైంది, ఎందుకు ఆస్పత్రిలో ఉంది?

Anchor lasya: ప్రముఖ యాంకర్ లాస్య మంజునాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చీమ, ఏనుగు జోక్స్ తో బాగా పాపులర్ అయిన ఈమె ప్రస్తుతం ఆసుపత్రి పాలైంది.  ఈ విషయాన్ని ఆమె భర్త మంజునాథ్ యే నేరుగా తెలిపారు. తన సామాజిక మాధ్యమ అకౌంట్ల ద్వారా లాస్య అభిమానులకు విషయాన్ని వివరించాడు. అంతే కాకుండా గెట్ వెల్ సూన్ అంటూ రాసుకొచ్చాడు. అయితే మంజునాథ్ షేర్ చేసిన వీడియోలో లాస్య బెడ్ పై పడుకొని ఉంది. మాస్కు కూడా పెట్టుకొని ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే బెడ్ పై ఉన్న లాస్యకు వరుసగా సెలైన్ ఎక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పోస్టు చూసిన ప్రతీ ఒక్కరూ లాస్యకు ఏమైందంటూ కామెంట్లు చేస్తున్నారు. లాస్య ఆసుపత్రిలో ఎందుకు చేరిందంటూ తెగ టెన్షన్ పడిపోతున్నారు. కరోనా సోకిందేమోనని కొందరు, మళ్లీ గర్భవతి అయ్యుండొచ్చని కొందరు అంటున్నారు. అయితే ఆమె ఆసుపత్రిలో ఎందుకు చేరిందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆమె త్వరగా కోలుకోవాలని మాత్రం నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel