Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Anasuya in bigg boss : బిగ్ బాస్ సీజన్ 6లో అనసూయ..? ఎంత అడిగిందంటే?

Anasuya in bigg boss : తన అందాలు ఆరబోస్తూ చాలా తక్కువ టైం లోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ. జబర్దస్త్ షోతో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. యాంకరింగ్ లోనూ ఆ రేంజ్ లో అందాలను ఆరబోయవచ్చా అనేది అనసూయ తర్వాతే తెలిసింది అందరికీ. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ కుర్రకారును పిచ్చేక్కించింది. ఇదే క్రమంలోనే సినిమాల్లోనూ పాత్రలు రావడంతో ఇరగదీసేసింది. పవర్ ఫుల్ రోల్స్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. రంగస్థలం, క్షణం, పుష్ప లాంటి సినిమాలు అనసూయకు మంచి నటిగా గుర్తింపు తీసుకురావడంతో పాటు ఆయా సినిమా పెద్ద హిట్ కావడంతో క్రేజ్ కు క్రేజ్ ఆఫర్లకు ఆఫర్లు వచ్చి పడ్డాయి. అడపాదడపా ఐటెం సాంగ్స్ లోనూ నటిస్తోంది ఈ ఆంటీ.

Anasuya in bigg boss

ఇదే సమయంలో అనసూయ క్రేజ్ చూసిన స్టార్ టీవీ.. రంగమ్మత్తను బిగ్ బాస్ లోకి తీసుకురావాలని చాలా రోజుల నుండే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ అనసూయనే స్టార్ మా వారి ఆఫర్ ను రిజెక్టు చేస్తూ వస్తోంది. తను బిజీ ఆర్టిస్ట్ కావడం.. తన కాల్షీట్ల కోసం దర్శకులు, నిర్మాతలు వెయిట్ చేస్తుండటంతో ఆమె బిగ్ బాస్ కు వెళ్లడం లేదు. ఇంతటి బిజీ షెడ్యూల్ ను, ఆదాయాన్ని వదులుకొని ఆమె బిగ్ బాస్ కు వెళ్లాల్సిన అవసరం లేదని అనుకుంటోంది.

కానీ బిగ్ బాస్ టీం మాత్రం ఆమె కోసం ప్రయత్నాలు ఆపడం లేదు. ఆమె షోకు వస్తే.. బిగ్ బాస్ మరింతగా క్రేజ్ సంపాదించుకుంటుందని వారి భావన. ఈ మధ్యే అనసూయకు ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది మూడు వారాల పాటు హౌస్ లో ఉండేందుకు కోటి రూపాయలు ఇస్తామన్నారట. మరి అనసూయ ఒప్పుకుంటుందో లేదో చూడాలి. బిగ్ బాస్ ఆరో సీజన్ ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Read Also : Anchor anasuya: ముసలిదానివి అయ్యావంటూ యాంకర్ అనసూయపై ట్రోల్స్..!

Exit mobile version